విలన్ గా మారబోతున్న న్యాచురల్ స్టార్.. ఏ సినిమా కోసమంటే?

తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి అసిస్టెంట్ డైరెక్టర్ గా అడుగు పెట్టి ఆ తరువాత అష్టాచమ్మా సినిమా ద్వారా హీరోగా పరిచయమైన నటుడు నాని.

నాని ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత ఎన్నో అద్భుతమైన సినిమాలలో విభిన్న పాత్రల్లో నటించారు.

అయితే తన కెరియర్లో హిట్ ఫ్లాప్ అనే సంబంధం లేకుండా వరుసగా సినిమాలు తీస్తూ ప్రేక్షకులను సందడి చేస్తున్నారు.ఇప్పటివరకు ఎన్నో విభిన్నమైన పాత్రల్లో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్న నాచురల్ స్టార్ నాని వీ అనే చిత్రం ద్వారా నెగిటివ్ పాత్రలో నటించి తనలో ఉన్నటువంటి ఒక కొత్త యాంగిల్ ను ప్రేక్షకులకు పరిచయం చేశారు.

ఇలా అసిస్టెంట్ డైరెక్టర్ గా నటుడిగా నిర్మాతగా ఎంతో మంచి పేరు సంపాదించుకున్న నాని మొట్ట మొదటి సారిగా ఓ సినిమాలో ఓ హీరో కోసం విలన్ పాత్రలో నటించడానికి సిద్ధమయ్యారు.నాని ఈ సరికొత్త ప్రయోగాన్ని తమిళ స్టార్ హీరో విజయ్ నటిస్తున్నటువంటి సినిమాలో నాని విలన్ పాత్రలో నటించబోతున్నట్లు సమాచారం.

ఇప్పటివరకు తమిళ సినిమాలు తెలుగులో డబ్ అయ్యి ఎంతో మంది ప్రేక్షకులను సంపాదించుకున్న విజయ్ ఈ సారి ఏకంగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాణంలో అత్యంత భారీ బడ్జెట్ చిత్రంగా పూర్తిస్థాయి తెలుగు చిత్రంలో నటిస్తున్నారు.ఈ చిత్రంలో విజయ్ తో పోటీ పడటానికి నాని సిద్ధమైనట్లు తెలుస్తోంది.ఇకపోతే ఇందులో విజయ్ సరసన రష్మిక లేదా కియారా అద్వానీ నటించబోతున్నారని సమాచారం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.

Advertisement

ఈ క్రమంలోనే ఈ విషయాలపై చిత్రబృందం అధికారక వెల్లడించాల్సి ఉంది.

వారికి గాజు గ్లాస్ గుర్తు.. కోర్టుకెక్కిన జనసేన 
Advertisement

తాజా వార్తలు