రేవంత్ కాంగ్రెస్ లో తనకంటూ ఓ వర్గాన్ని ఏర్పరుచుకుంటున్నారా?

తెలంగాణ రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ నేతగా రేవంత్ కు పేరు ఉంది.

అయితే తనకున్న ఆ ప్రత్యేక లక్షణమే కాంగ్రెస్ లాంటి అతిపెద్ద పార్టీలో చేరిన కొద్ది సమయంలోనే పీసీసీ చీఫ్ పదవి దక్కడం అనేది జరిగింది.

అయితే కాంగ్రెస్ పార్టీలో ప్రజాస్వామ్యం ఎంతటిదో మనం చాలా సార్లు చూసాం.అయితే రేవంత్ ను పీసీసీ చీఫ్ గా ప్రకటించిన తరువాత చాలా మంది సీనియర్లు పెదవి విరిచిన పరిస్థితి ఉంది.

దీంతో కొన్ని రోజులు పీసీసీ చీఫ్ పేరు ప్రకటన కూడా వాయిదా పడ్డ విషయం తెలిసిందే.అయితే ఇప్పటికీ కాంగ్రెస్ లోని కొంత మంది సీనియర్లు రేవంత్ అంటి ముట్టనట్టుగా వ్యవహారిస్తున్నారని సమాచారం.

అందుకే పార్టీ అభివృద్ధి పట్ల తనకున్న వ్యూహాలను దృష్టిలో ఉంచుకొని, ఆ వ్యూహాలను విజయవంతం చేసుకోవాలంటే తనకు 100 శాతం సహకరించే ఓ వర్గాన్ని ఏర్పాటు చేసుకుంటున్నారట.అయితే ఏది ఏమైనా అందరు కలిసికట్టుగా చేసిన ప్రయత్నానికి, కొంత మంది కలిసి చేసిన ప్రయత్నం ఫలితం తేడా ఉంటుంది.

Advertisement

ఏది ఏమైనా రేవంత్ వేస్తున్న ఈ అడుగులు కాంగ్రెస్ విజయానికి ఎంత మేరకు దోహద పడతాయనేది చూడాల్సి ఉంది.ఏది ఏమైనా రేవంత్ పగ్గాలు చేపట్టాక కాంగ్రెస్ కొంత బలపడిందన్న విషయం వాస్తవం.

వారికి గాజు గ్లాస్ గుర్తు.. కోర్టుకెక్కిన జనసేన 
Advertisement

తాజా వార్తలు