యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘రాధేశ్యామ్’ ఎప్పుడు రిలీజ్ అవుతుందా అనే ప్రశ్న ప్రస్తుతం అభిమానులతో పాటు సినీ వర్గాల్లో వినిపిస్తూ వస్తోంది.ఈ సినిమాకు సంబంధించి అడపాదడపా ఓ అప్‌డేట్‌ను ఇవ్వడం తప్ప ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ చేస్తామనే విషయంపై చిత్ర యూనిట్ ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు.
ఇక ఈ సినిమా రిలీజ్ కాకముందే, ప్రభాస్ తన నెక్ట్స్ చిత్రాలను తెరకెక్కిస్తూ బిజీగా మారిపోయాడు.ఆయన ప్రస్తుతం కన్నడ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్‌లో సలార్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.
ఈ సినిమాతో పాటు బాలీవుడ్ డైరెక్టర్ ఓం రావుత్ డైరెక్షన్‌లో ఆదిపురుష్ అనే భారీ పాన్ ఇండియా మూవీని కూడా తెరకెక్కిస్తు్న్నాడు.ఇక మహానటి చిత్రంతో అదిరిపోయే గుర్తింపును తెచ్చుకున్న దర్శకుడు నాగ్ అశ్విన్ డైరెక్షన్‌లో ఓ సైన్స్ ఫిక్షన్ సినిమాను తీసేందుకు ప్రభాస్ రెడీ అయ్యాడు.
ఈ సినిమాను ఇప్పటికే అఫీషియల్‌గా అనౌన్స్ చేసిన చిత్ర యూనిట్, ఇందులోని నటీనటులను ఎంపిక చేస్తు్న్నారు.అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కనున్న ఈ సినిమాను ఎప్పుడు పట్టాలెక్కిస్తారా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.
అయితే ఈ సినిమాను డిసెంబర్ నెలలో పట్టాలెక్కించాలని ప్రభాస్ పట్టుదలగా ఉన్నట్లు తెలుస్తోంది.
డిసెంబర్ నాటికి రాధేశ్యామ్ చిత్రం పూర్తిగా ముగించుకుని సలార్, ఆదిపురుష్ చిత్రాలను కూడా ఎక్కువశాతం షూటింగ్ జరుపుకోవాలని ప్రభాస్ ప్లాన్ చేస్తున్నాడు.
నాగ్అశ్విన్ సినిమా భారీ గ్రాఫీక్స్‌తో రానుండటంతో ఈ సినిమాకు వీలైనంత ఎక్కువ సమయం కేటాయించాలని ప్రభాస్ చూస్తున్నాడు.అందుకే ఈ సినిమాన డిసెంబర్‌లో ప్రారంభించి, నిర్విరామంగా షూటింగ్ జరపాలని ప్రభాస్ ఆలోచిస్తున్నాడు.
కాగా ఈ సినిమాకు ‘వృందావన’ అనే టైటిల్‌ను పరిశీలిస్తుండగా, ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే హీరోయిన్‌గా నటిస్తోంది.బిగ్ బి అమితాబ్ బచ్చన్ ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో నటిస్తుండగా నిర్మాత అశ్వినీ దత్ ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేస్తున్నాడు.







