మన దేశంలో ప్రస్తుతం సామన్యుడి నడ్డీ విరుగుతున్నది.నిత్యావసరాలతో పాటు పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్నంటుతున్నాయి.
వాహనదారులు తమ వెహికల్స్‌లో ఇంధనం పోయించుకునేందుకుగాను భయపడిపోతున్నారు.పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలని సామాన్యులు డిమాండ్ చేస్తున్నారు.
ఈ విషయమై విపక్షాలు కూడా ఆందోళన చేస్తున్నాయి.ఈ నేపథ్యంలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ మీడియాతో మాట్లాడారు.
త్వరలో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతాయా.? అనే క్వశ్చన్‌కు ఆమె ఆన్సర్ ఇచ్చారు.పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకాల తగ్గింపు యోచన ప్రస్తుతం ప్రభుత్వం పరిశీలనలో లేదని పేర్కొన్నారు.ఎక్సైజ్ సుంకాలు ఆల్‌టైమ్ గరిష్టానికి చేరుకున్న నేపథ్యంలో ఆమె పై వ్యాఖ్యలు చేశారు.
మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని గత యూపీఏ సర్కారు ఇంధన ధరలకు సంబంధించి భారీ సబ్సిడీలు ఇచ్చిందని పేర్కొంటూ, ఇందుకు సంబంధించి చెల్లింపు భారాలు ఇప్పటికీ తీవ్రంగా ఉన్న కారణంగా ఎక్సైజ్ సుంకాల కోత అంశం ప్రస్తుతం పరిశీలనలో లేదని తెలిపారు.
గతంలో యూపీఏ సర్కారు జారీ చేసిన రూ.1.34 లక్షల కోట్ల విలువైన ఆయిల్ బాండ్స్‌కు సంబధించి గత ఏడేళ్లలో రూ.70,196 కోట్ల వడ్డీ భారం తమ సర్కారుపైన పడిందని వివరించారు నిర్మలా సీతారామన్.కా రూ.1.3 లక్షల కోట్లు చెల్లించాల్సి ఉందని ఆమె తెలిపారు.ఆయిల్ బాండ్ల భారాన్ని భరించాల్సిన స్థితి లేకపోయినట్లయితే, ఇంధనంపై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించే పరిస్థితిలో ఉండేవాళ్లం అని చెప్పారు.ముడి చమురు ధరలు అప్పట్లో పెరిగినప్పటికీ ధరలు పెంచకుండా ఉండేందుకుగాను యూపీఏ సర్కారు ఆయిల్ కంపెనీలకు రుణ పత్రాలు జారీ చేసిందని కేంద్రమంత్రి నిర్మల గుర్తు చేశారు.ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నుంచి 2025-26 ఆర్థిక సంవత్సరం మధ్య వరకు మొత్తంగా ఇంకా రూ.1.3 లక్షల కోట్లను సర్కారు చెల్లించాల్సి ఉంటుందని వివరించారు.పెట్రోలియం ప్రొడక్ట్స్‌ను జీఎస్టీ పరిధిలోకి తీసుకొచ్చేందుకు కేంద్రసర్కారు సిద్ధంగా ఉందని, అయితే, రాష్ట్రాలు ఒప్పుకుంటేనే అది సాధ్యమవుతుందని కేంద్ర మంత్రి చెప్పారు.







