శేఖర్ మాస్టర్ కు అందుకే ముద్దు పెట్టాను.. క్లారిటీ ఇచ్చిన యాంకర్ శ్రీముఖి!

స్టార్ యాంకర్ శ్రీముఖి పలు షోలలో శేఖర్ మాస్టర్ కు ముద్దు పెట్టడం నెట్టింట తెగ వైరల్ అయిన సంగతి తెలిసిందే.శేఖర్ మాస్టర్ పెళ్లైన డ్యాన్స్ మాస్టర్ కావడంతో శ్రీముఖి ముద్దు పెట్టడంపై భిన్నాభిప్రాయాలు వినిపించాయి.

 Anchor Srimukhi Clarity About Sekhar Master Kiss , Anchor Srimukhi, Clarity, Int-TeluguStop.com

శ్రీముఖి ప్రస్తుతం క్రేజీ అంకుల్స్ సినిమా ప్రమోషన్స్ తో బిజీగా ఉన్నారు.ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొనగా ఈ నెల 19వ తేదీన ఈ సినిమా రిలీజ్ కానుందని సమాచారం.

ఈ సినిమాలో శ్రీముఖి స్వీటీ పాత్రలో నటిస్తున్నారు.సత్తిబాబు ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది.ఒక ఇంటర్యూలో శేఖర్ మాస్టర్ కు ముద్దు పెట్టడం గురించి శ్రీముఖి స్పందిస్తూ ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

ఒక షోలో తాము ఇద్దరం పాల్గొన్నామని తాను, శేఖర్ మాస్టర్ ఆ షోలో ఆర్టిస్టులలా బిహేవ్ చేశామని అన్నారు.ఆ సమయంలో ముద్దులు పెట్టానని అందులో తప్పేం ఉందని తన అభిప్రాయమని శ్రీముఖి చెప్పుకొచ్చారు.

సిక్త్ సెన్స్ ప్రోగ్రామ్ లో క్రాక్ సినిమాలోని పాటకు తాను, శేఖర్ మాస్టర్ డ్యాన్స్ వేశామని ఆ సాంగ్ లో ఎన్నిసార్లు హీరోయిన్ ఉమ్మ అని చెప్పిందనే ప్రశ్నకు తాను సమాధానం కరెక్ట్ గా చెప్పానని శ్రీముఖి వెల్లడించారు.ఆ టైమ్ లో ఓంకార్ గారు ముద్దు పెట్టమన్నట్టుగా సైగలు చేయడంతో శేఖర్ మాస్టర్ కు ముద్దు పెట్టేశానని శ్రీముఖి అన్నారు.

యాంకర్లు నవ్వు రాకపోయినా నవ్వాల్సి ఉంటుందని శ్రీముఖి చెప్పుకొచ్చారు.

Telugu Anchor Srimukhi, Sekhar Master-Movie

క్రేజీ అంకుల్స్ ప్రమోషనల్ కార్యక్రమాల్లో పాల్గొంటున్న శ్రీముఖి ఒక యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొని ఈ విషయాలను వెల్లడించారు.క్రేజీ అంకుల్స్ సినిమాపై బాగానే అంచనాలు నెలకొనగా ఈ సినిమా ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో చూడాల్సి ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube