ఈ ఇద్దరి టార్గెట్ కేసీఆరే ? అందుకే ఇంతగా ?

తెలంగాణలో జరుగుతున్న హుజురాబాద్ ఉప ఎన్నికలు అన్ని పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారాయి.

ఇక్కడ గెలవడం ద్వారానే రాబోయే సార్వత్రిక ఎన్నికలకు గెలుపు బాట అవుతుందని అన్ని పార్టీలు బలంగా నమ్ముతున్నాయి.

ఇక్కడ గెలిచేందుకు అవసరమైన అన్ని ఎత్తులు, పై ఎత్తులు వేస్తూ,  తెలంగాణ రాజకీయాలను మరింత వేడెక్కిస్తున్నారు.ముఖ్యంగా కాంగ్రెస్ తెలంగాణ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఒక వైపు, తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ మరోవైపు కేసీఆర్ ను ఢీ కొట్టేందుకు సిద్ధమవుతున్నారు.

ఇప్పటికే సభలు సమావేశాల ద్వారా టిఆర్ఎస్ ను ఇరుకున పెడుతూ వస్తున్నారు.ఇక ఈ నెల 24వ తేదీ నుంచి సంజయ్ పాదయాత్ర చేపట్టబోతున్నారు.

ఇందులో ప్రధానంగా టిఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలు , అవినీతి వ్యవహారాలపై సంజయ్ విమర్శలు ఎక్కుపెట్టెందుకు సిద్ధమవుతున్నారు.కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఇప్పటికే దళిత గిరిజన సభను నిర్వహించి కేసిఆర్ ప్రవేశపెట్టిన దళిత బంధు పథకం ద్వారా టిఆర్ఎస్ లబ్ధి పొందకుండా చేసే ప్రయత్నాల్లో ఉన్నది అలాగే వరుసగా సభలు సమావేశాలు నిర్వహిస్తూ రేవంత్ కేసీఆర్ ను ఇరికించే  ప్రయత్నం చేస్తున్నారు.

Advertisement

ఒకవైపు రేవంత్ , మరో వైపు టిఆర్ఎస్ రాజకీయం తో టీఆర్ఎస్ ఉక్కిరి బిక్కిరి అవుతోంది.బిజెపి అభ్యర్థిగా ప్రచారం అవుతున్న ఈటెల రాజేందర్  బలమైన పునాదులు హుజూరాబాద్ నియోజకవర్గం లో వేసుకోవడంతో, ఆయన ను ఓడించడం అంత ఆషామాషీ కాదనేది కేసీఆర్ అభిప్రాయం.

అలాగే కాంగ్రెస్ నుంచి కొండా సురేఖ పోటీ చేసే ఆలోచనలో ఉండడంతో టిఆర్ఎస్ కు ఈ పరిణామాలు కాస్త ఇబ్బందికరంగా మారాయి.

ప్రస్తుతం రేవంత్ రెడ్డి కి కానీ,  బండి సంజయ్ కి కానీ హుజురాబాద్ ఎన్నికలు చాలా ప్రతిష్టాత్మకంగా మారాయి.ఈ ఎన్నికల్లో వచ్చే విజయం ఆధారంగానే రాబోయే ఎన్నికల ఫలితాలు ఉండబోతుండడంతో  ఇంతగా టెన్షన్ పడుతున్నట్లు కనిపిస్తున్నారు.బండి సంజయ్ పాదయాత్ర , రేవంత్ రెడ్డి బహిరంగ  మీటింగులు ఇవన్నీ , టిఆర్ఎస్ కు ఇబ్బంది కలిగించే అంశాలే.

నేటి ఎన్నికల ప్రచారం : బాబు అక్కడ .. జగన్ ఇక్కడ 
Advertisement

తాజా వార్తలు