దర్శకధీరుడు రాజమౌళి బాహుబలి వంటి విజువల్ వండర్ తరువాత తెరకెక్కిస్తున్న ప్రెస్టీజియస్ మల్టీస్టారర్ మూవీ ఆర్ఆర్ఆర్ కోసం యావత్ భారతదేశ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఇక ఈ సినిమాతో మరోసారి ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేసేందుకు జక్కన్న అండ్ టీమ్ రెడీ అవుతోంది.
అయితే ఈ సినిమాను గతేడాదే రిలీజ్ చేయాల్సి ఉన్నా, కరోనా కారణంగా అది కుదర్లేదు.దీంతో ఈ సినిమాను దసరా కానుకగా అక్టోబర్ 13న రిలీజ్ చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది.
అయితే ఈ సినిమాను ఎట్టిపరిస్థితుల్లో దసరా కానుకగా రిలీజ్ చేస్తారని అందరూ అనుకుంటున్నారు.కానీ ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే ఇది సాధ్యం అయ్యేలా లేదు.
ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి కొన్ని కీలక సన్నివేశాలను ఉక్రెయిన్ దేశంలో తెరకెక్కిస్తున్నారు చిత్ర యూనిట్.అక్కడ షూటింగ్ ముగించుకుని ఇండియాకు తిరిగి వచ్చాక మరికొంత షూటింగ్ పనులు మిగిలి ఉండటంతో పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఎప్పుడు పూర్తవుతాయో తెలియని పరిస్థితి.
దీంతో ఈ సినిమాను దసరా కానుకగా రిలీజ్ చేయడం డౌటే అంటున్నారు సినీ విశ్లేషకులు.
ఏదేమైనా ఈసారి ఖచ్చితంగా దసరాకు సినిమాను రిలీజ్ చేస్తామని చెబుతున్న జక్కన్న అండ్ టీమ్ మరోసారి ప్రేక్షకులకు ఝలక్ ఇవ్వడం ఖాయమనే కనిపిస్తుంది.
ఇక ఈ సినిమాలో తారక్ కొమురం భీం పాత్రలో నటిస్తుండగా, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తున్నాడు.ఈ సినిమాను డివివి దానయ్య అత్యంత భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేస్తోన్న సంగతి తెలిసిందే.
వారితో పాటు బాలీవుడ్ నటుడు అజయ్ దేవ్గన్, అందాల భామ ఆలియా భట్, ఒలివియా మారిస్‌లు కూడా ఈ సినిమాలో నటిస్తున్నారు.మరి ఆర్ఆర్ఆర్ చిత్రం ఎప్పుడు రిలీజ్ అవుతుందో తెలియాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.