ఈ ఫోటోలో ఉన్న చిచ్చరపిడుగును మీరు గుర్తుపట్టారా?

ఇండస్ట్రీలో ఎంతోమంది స్టార్ హీరోలు ఉన్నా కొందరు హీరోలు మాత్రమే తన నటనా ప్రతిభతో దేశవ్యాప్తంగా గుర్తింపును సొంతం చేసుకుంటారు.అలా సౌత్ ఇండియా సినిమాలలో నటించి దేశవ్యాప్తంగా పేరు తెచ్చుకున్న వారిలో కమల్ హాసన్ ఒకరు.

 Kamal Hasan Child Hood Photos Goes Viral In Social Media, Child Hood , Photos ,-TeluguStop.com

బాలనటుడిగా తన నటప్రస్థానాన్ని మొదలుపెట్టిన కమల్ హాసన్ తొలి సినిమాతోనే జాతీయ పురస్కారాన్ని సొంతం చేసుకోవడం గమనార్హం.కమల్ హాసన్ ఎంచుకునే కథలతో పాటు ఫైట్లలో, డ్యాన్స్ లలో కూడా ఎంతో వైవిధ్యం ఉంటుంది.

నటుడిగా 62 సంవత్సరాల అనుభవం ఉన్న ఈ నటుడు బాలనటుడిగా కళథూర్ కణ్ణమ్మ సినిమాలో నటించిన సమయంలో ఇతని వయస్సు కేవలం 4 సంవత్సరాలు కావడం గమనార్హం.ఆ సినిమాలో ప్రధాన పాత్రల్లో నటించిన సావిత్రి జెమినీ గణేషన్ సైతం కమల్ హాసన్ నటనను చూసి ఆశ్చర్యపోయారు.

కమల్ హాసన్ అసలు పేరు పార్థసారథి కాగా అందరూ పార్థు అనే ముద్దుపేరుతో కమల్ హాసన్ ను పిలిచేవారు.

Telugu Childhood, Kamal Hassan, Kolywood, Savitri, Tollywood-Movie

తొలి సినిమాతోనే సక్సెస్ సాధించిన కమల్ హాసన్ ఆ తర్వాత మరికొన్ని సినిమాల్లో బాలనటుడిగా నటించారు.మలయాళం మూవీ కన్యాకుమారితో 20 సంవత్సరాల వయస్సులోనే హీరోగా మారిన కమల్ హాసన్ నటుడిగా కెరీర్ ను కొనసాగిస్తున్నారు.కమల్ హాసన్ నటుడిగా కెరీర్ ను మొదలుపెట్టి 62 సంవత్సరాలు కావడంతో ఆయన చిన్నప్పటి ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.

Telugu Childhood, Kamal Hassan, Kolywood, Savitri, Tollywood-Movie

ఒకవైపు మాస్ సినిమాల్లో నటించడంతో పాటు క్లాస్ సినిమాల్లో కూడా కమల్ హాసన్ నటించారు.తమిళంలో కమల్ హాసన్ బిగ్ బాస్ షోకు హోస్ట్ గా వ్యవహరించారు.కమల్ హాసన్ నటనకు ఎన్నో అవార్డులు సైతం వచ్చాయి.మొదట వాణీగణపతిని వివాహం చేసుకున్న కమల్ హాసన్ ఆ తర్వాత సారికను పెళ్లి చేసుకున్నారు.కొన్ని కారణాల వల్ల కమల్ హాసన్ సారికతో విడిపోయారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube