సోను సూద్ ఈ పేరు గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు.వెండితెరపై విలన్ గా నటించిన నిజ జీవితంలో మాత్రం ఒక గొప్ప హీరో అని చెప్పవచ్చు.
కరోనా విపత్కర సమయంలో సోనుసూద్ చేసిన సేవల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఆపద సమయంలో ఉన్న ఎంతోమందిని ఆదుకొని అందరికీ ఎన్నో సహాయాలు చేశారు.
ఈ క్రమంలోనే ఇతని మంచి మనస్తత్వం, గొప్పతనం గురించి దేశమంతా మారుమోగిపోయింది.ఈ విధంగా ఎంతోమందికి ఎన్నో విధాలుగా సహాయపడిన సోను సూద్ తెరపై ఎంతో గంభీరంగా కనిపించినప్పటికీ స్వతహాగా ఎంతో బిడియస్తుడని చెప్పవచ్చు.
ప్రస్తుతం సోనుసూద్ హిందీలో ‘సీషా’ అనే చిత్రంలో నటిస్తున్నారు.ఈ సినిమాలో నటి నేహా ధూపియాతో కలిసి రొమాంటిక్ ముద్దు సన్నివేశం ఉంది.ఈ సీన్లో చేయడానికి సోనుసూద్ ఎంతో ఆలోచించారు.ఎలాగైనా ఈ సన్నివేశాన్ని తొలగించాలని నానా విధాలుగా ప్రయత్నించినప్పటికీ దర్శకుడు ఒప్పుకోకపోవడంతో చాలా మొహమాటపడుతూనే ఈ సీన్ లో నటించాడు.
ఇక కరోనా విపత్కర సమయంలో సోను సూద్ చేసిన సేవలకు ఎంతో మంది అభిమానులుగా మారిపోయారు.ఈ క్రమంలోనే ఒకసారి ఓ సినిమా షూటింగ్ నిమిత్తం విశాఖపట్నంలో షూటింగ్ నిర్వహిస్తుండగా ఓ అమ్మాయి తనను సోనూసూద్ కు వీరాభిమాని అంటూ అక్కడికి వెళ్లి అతని చేత ఆటోగ్రాఫ్ తీసుకుంది.

ఆటోగ్రాఫ్ తీసుకున్న అమ్మాయి ఎలాగో కష్టపడి సోనుసూద్ నెంబర్ కనుక్కొని తరచూ తనకి మెసేజ్ పంపేది.అదేవిధంగా ఒకసారి సోనుసూద్ కోసం ఎంతో విలువైన బహుమతి కూడా పంపించింది.ఈ బహుమతి చూసి సోను సూద్ ఆ అమ్మాయి పై ఆగ్రహం వ్యక్తం చేశాడు.”ఇలాంటి ఖరీదైన గిఫ్ట్ లు పంపించే బదులు నీ చదువుకు అవసరమైన పుస్తకాలు కొనుక్కోవచ్చు” కదా అంటూ అమ్మాకి చెప్పారు.అదేవిధంగా ఒక రోజు అమ్మాయి ” మీ కోసం ముంబై వస్తున్నా.” అంటూ మెసేజ్ చేయడంతో సోను సూద్ స్పందిస్తూ….ఆ పని చేసావంటే పోలీసులకు ఫిర్యాదు చేస్తా అన్నాడు.ఇక అప్పటినుంచి ఆ అమ్మాయి సోనూసూద్ కు ఫోన్, మెసేజ్ చేయడం మానేసింది.ప్రస్తుతం సోను సూద్ తెలుగులో ఆచార్య సినిమాలో ఒక కీలక పాత్రలో నటిస్తున్నట్లు మనకు తెలిసిందే.