రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో సినిమా పట్టాలెక్కబోతుంది.సినిమాకు సంబంధించిన ప్రతి సన్నివేశంను కూడా అద్బుతంగా తెరకెక్కించడంలో దర్శకుడు శంకర్ సిద్ద హస్తుడు.
అలాంటి శంకర్ దర్శకత్వంలో సినిమా అంటే ఖచ్చితంగా రామ్ చరణ్ అభిమానులు మరియు తెలుగు ప్రేక్షకులు అంతా కూడా భారీ ఎత్తున అంచనాలతో ఎదురు చూస్తారు.అలాంటి శంకర్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా విషయంలో అభిమానులు ఒక్క విషయంలో మాత్రం నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నారు.
ఏంటీ అది అంటే ఈ సినిమాలో హీరోయిన్ గా కియారా అద్వానీని హీరోయిన్ గా ఎంపిక చేశారు.సినిమా షూటింగ్ ప్రారంభించేందుకు కొన్ని రోజుల ముందు ఈ విషయాన్ని యూనిట్ సభ్యులు అధికారికంగా ప్రకటించారు.
సినిమాపై మొదటి నుండి కూడా అంచనాలు భారీగా ఉన్నాయి.అంచనాలు తగ్గట్లుగా ఈ సినిమాను భారీ ఎత్తున తెరకెక్కించేందుకు గాను ఏర్పాట్లు చేస్తున్నారు.
ఈ సినిమా లో హీరోయిన్ పాత్రకు గాను కియారా అద్వానీని ఎంపిక చేయడం జరిగింది అంటూ వార్తలు వస్తున్నాయి.ఈ సమయంలోనే శంకర్ ఆ విషయాన్ని నిజమే అంటూ నేడు అధికారిక ప్రకటన చేశాడు.
సినిమా షూటింగ్ ను మొదలు పెట్టబోతున్నట్లుగా శంకర్ ఇటీవలే ప్రకటించాడు.అయితే ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది.

ఈ సమయంలో శంకర్ సినిమాలో హీరోయిన్ గా కియారా అద్వానీ అంటూ ప్రకటించిన నేపథ్యంలో అభిమానులు కాస్త టెన్షన్ పడుతున్నారు.ఎందుకంటే ఇప్పటికే రామ్ చరణ్ హీరోగా కియారా అద్వానీ హీరోయిన్ గా ఒక సినిమా వచ్చింది.అది ప్లాప్ అయ్యింది.అట్టర్ ప్లాప్ అయిన ఆ సినిమా లో నటించిన ఇద్దరు మళ్లీ నటించడం అంటే కాస్త సాహసమే.మరి ఈ సాహసం ఎంత వరకు వర్కౌట్ అవుతుంది అనేది చూడాలి.