యజమానిపై విశ్వాసం.. పాముతో పోరాడిన పిల్లి.. !

పెంపుడు జంతువులు తమను ప్రేమగా చూసే మనుషులపై తమ విశ్వాసాన్ని చూపిస్తూనే ఉంటాయి.మాములుగా అయితే కుక్కలు విశ్వాసంగా ఉంటాయని అందరు అంటూ ఉంటారు.

అనడమే కాదు నిజంగా కుక్కలు విశ్వాసంగానే ఉంటాయి.తమను ఎంతో జాగ్రత్తగా పెంచుకుంటున్న యజమానులకు చిన్న కష్టం వచ్చిన కూడా అవి చూస్తూ ఊరుకోవు.

తమను ప్రేమగా ఆదరించిన వ్యక్తులను అవి ఎప్పటికి మరచి పోవు. కృతజ్ఞత చూపిస్తూనే ఉంటాయి.

అయితే కేవలం కుక్కలను మాత్రమే మనం విశ్వాసానికి మారుపేరు అంటాము.కానీ మిగతా జంతువులు కూడా తమ యజమానులపై కృతజ్ఞతను కలిగి ఉంటాయి.

Advertisement

అవసరమైతే ప్రాణాలను కూడా లెక్క చేయకుండా యజమానులు కాపాడడానికి ముందు ఉంటాయి.

తాజాగా ఒరిస్సాలో ఇలాంటి ఘటనే జరిగింది.తన యజమాని కుటుంబం ఆపదలో ఉందని వారు పెంచుకుంటున్న పెంపుడు పిల్లి తన ప్రాణాలను కూడా లెక్క చేయకుండా నాగు పాముతో తలపడింది.భువనేశ్వర్ లో నివసిస్తున్న సంపద్ ఇంట్లోకి సాయత్రం వేళలో ఒక నాగు పాము లోపలికి రావడానికి ప్రయత్నిస్తుంది.

ఆ నాగు పామును చుసిన సంపద్ కుటుంబ సభ్యులు భయపడ్డారు.

అప్పుడు వారు పెంచుకుంటున్న పెంపుడు పిల్లి ఆ పాము ను చూసింది.ఆ నాగు పామును ఇంట్లోకి రానివ్వకుండా అడ్డు పడింది.ఆ పిల్లి ఆ పామును లోపలి రాకుండా దానితో పోరాడుతుంది.

మిల్క్ పౌడర్‌లో వైన్ కలిపిన అమ్మమ్మ.. కోమాలోకి వెళ్లిపోయిన పిల్లోడు..??
ఈ మాజీ ముఖ్యమంత్రుల పిల్లలందరు ఈ సారి ఎన్నికల్లో సత్తా చాటేనా ?

వాళ్ళు ఈ లోపు స్నేక్ హెల్ప్ లైన్ కు ఫోన్ చేసి విషయం చెప్పారు.ఆ పిల్లి స్నేక్ హెల్ప్ లైన్ వారు వచ్చే వరకు అక్కడే కాపలాగా ఉంది.

Advertisement

పామును ఇంట్లోకి రానివ్వ లేదు.తర్వాత వారు ఆ నాగు పామును పట్టుకుని వెళ్లిపోయారట.

చూసారా మూగ జీవులు కూడా ప్రేమను వ్యక్త పరుస్తాయి.

తాజా వార్తలు