కాక‌రేపుతున్న బండి సంజ‌య్ వ్యాఖ్య‌లు.. ఈ సారి ఇద్ద‌రు సీఎంల‌ను!

మొన్న‌టి దాకా ఏపీ, తెలంగాణ నేత‌ల మ‌ధ్య కృష్ణా జ‌లాల వివాదంలో ఓ రేంజ్‌లో మాట‌ల యుద్ధం సాగింది.ఈ విష‌యాన్ని బేస్ చేసుకుని అటు టీఆర్ ఎస్‌, ఇటు వైసీపీ బాగానే జ‌నాల్లో పాపులారిటీ తెచ్చుకున్నాయి.

 Sanjays Comments On The Cart This Time Two Cms, Sanjay, Kcr, Bandi Sanjay, Telan-TeluguStop.com

వ‌చ్చే ప‌రిణామాల నుంచి త‌ప్పించుకుని బాగానే పేరు సంపాదించాల‌ని చూశాయి.కానీ అనూహ్యంగా ఇందులోకి కేంద్రం ఎంట‌ర్ అయి పెత్త‌నం మొత్తం బోర్డుల‌కు అప్ప‌గించింది.

దీంతో ఇరు రాష్ట్రాల సీఎంలు కాస్త నిరాశ‌లో ప‌డ్డారు.మంచిగా ఆ సెంటిమెంట్‌ను వాడుకుని ప్ల‌స్ అవ్వాల‌నుకుంటే ప్లాన్ మొత్తం బెడిసికొట్ట‌డంతో ఇటు కేసీఆర్‌, అటు జ‌గ‌న్ కాస్త నిరాశ‌లో కూరుకుపోయార‌నే చెప్పాలి.

అయితే ఈ వ్య‌వ‌హారంపై ఇప్పుడు బండి సంజ‌య్ చేసిన వ్యాఖ్య‌లు పెద్ద దుమార‌మే రేపుతున్నాయి.కృష్ణా జలాల వివాదంపై సీఎం కేసీఆర్ ఎందుకు మౌనంగా ఉంటున్నార‌ని బండి సంజయ్ ప్ర‌శ్నించారు.

జల వివాదాన్ని ప‌రిష్క‌రించేందుకు బీజేపీ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చాలా బాగుంద‌ని, ఇప్పుడు ఎలాంగి గొడ‌వ‌లు ఉండ‌వ‌ని వ్యాఖ్యానించారు.ఇక కేంద్రం తీసుకున్న నిర్ణ‌యంలో ఎవ‌రికీ అనుమానాలు వ‌ద్ద‌ని, దీని ద్వారా తెలంగాణ‌లో ఏ ప్రాజెక్టు కూడా ఆగబోదని, అందుకు త‌మ‌దీ హామీ అంటూ బాగానే క్రెడిట్ వేసుకునే ప్ర‌య‌త్నం చేశారు.

Telugu Ap Cm Jagan, Bandi Sanjay, Central Bjp, Krishnariver, Krishna, Sanjay, Ts

ఇక ఈ వ్య‌వ‌హారంపై ఇటు కేసీఆర్ ను, అటు జ‌గ‌న్‌ను క‌లిపి ఏకిపారేశారు.ఈ నీళ్ల వివాదలో త్వరలోనే ఇద్దరు సీఎంల అస‌లు బండారాన్ని బయట పెట్టి జ‌నాల‌కు నిజాల‌ను తెలియ‌జేస్తామంటూ ప్ర‌క‌టించారు బండి సంజ‌య్‌.అయితే కేంద్రం తీసుకున్న నిర్ణ‌యంతో తెలంగాణ‌కు అన్యాయం జ‌రుగుతుంద‌ని చాలామంది అంటుంటే ఇటు బండి సంజ‌య్ మాత్రం ఇలా కేంద్రాన్ని వెన‌కేసుకు రావ‌డంతో ఈ మాట‌లు ఇప్పుడు పెద్ద దుమారమే రేపే విధంగా ఉన్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube