ఆ వ‌ర్షం వీడియోల‌ను షేర్ చేస్తే కేసు పెడ్త‌రంట‌.. విష‌యం ఏంటంటే..?

సోష‌ల్ మీడియాతో ఎంత ప్ర‌యోజ‌నం ఉందో దానిని కొంద‌రు అంతే స్థాయిలో చెడు ప‌నులకు ఉప‌యోగిస్తున్నారు.

అదేం స‌ర‌దానో తెలియ‌దు గానీ ఏమీ లేని చోట ఏదో ఉంద‌ని ప్ర‌చారం చేసి జ‌నాల‌ను భ‌య‌పెట్ట‌డం ఈ మ‌ధ్య ప్ర‌తి ఒక్క‌రికీ అల‌వాటు అయిపోయింది.

ఇదే క్ర‌మంలో గ‌తేడాది హైదరాబాద్‌లో వ‌ర‌ద‌లు ఏ స్థాయిలో వ‌చ్చిందో అంద‌రికీ తెలిసిందే.దాని వ‌ల్ల ఎంతో మంది నిరాశ్ర‌యుల‌య్యారు.

చాలామంది ఇళ్లు మునిగిపోయాయి.బైకులు, కార్లు కొట్టుకుపోయాయి.

చాలామంది గ‌ల్లంత‌యిపోయారు.అత్యంత దారుణ‌మైన ప‌రిస్థితులు హైద‌రాబాద్ జ‌నాల‌ను ఎంత‌గానో వ‌ణికించాయి.

Advertisement

ఇక ఇప్పుడు కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తుండ‌టంతో దీన్నే అడ్వాంటేజ్‌గా చేసుకుంటున్నారు ఆక‌తాయిలు.ఎందుకంటే ఇప్పుడు హైదరాబాద్‌లో కూడా భారీగానే వ‌ర్షాలు ప‌డుతున్నాయి.

దీంతో కొన్ని రోజులుగా ఆక‌తాయిలు క‌లిసి గతేడాది వరదలు వ‌చ్చిన‌ప్పుడు వైర‌ల్ అయిన వీడియోలను ఈసారి వ‌చ్చిన‌ట్టు చెబుతూ విప‌రీతంగా షేర్‌ చేస్తున్నట్లు స్థానిక పోలీసులు గుర్తించారు.దీంతో జ‌నాలు మ‌ళ్లీ వణికిపోతున్నారు.

ఇక ఇదే విషయంపై రాచకొండ సీపీ మహేష్‌ భగవత్ అల‌ర్ట్ అయి వెంట‌నే అల్టిమేటం జారీ చేశారు.

పోయినేడాదికి వ‌ర‌ద‌లకు సంబంధించిన పాత వీడియోలను ఎవ‌రైనా సోష‌ల్ మీడియాలో వైరల్ చేస్తే వారిపై కఠినంగా వ్యవహరిస్తామని, ఎలాంటి వారైనా విడిచిపెట్ట‌కుండా కేసులు పెడ‌తామంటూ గ‌ట్టి వార్నింగ్ ఇచ్చారు.ప్ర‌స్తుతం కురుస్తున్న వర్షాల కారణంగా ఎవరికైనా స‌మ‌స్య‌లు వ‌స్తే వెంట‌నే 100కు ఫోన్‌ చేస్తే తాము స‌కాలంలో స్పందించి వారికి సాయం అందిస్తామ‌ని ఆయ‌న ప్ర‌క‌టించారు.ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో ఆప‌దలో ఉన్న వారికి పోలీసులు, జీహెచ్‌ఎంసీ అధికారు అండ‌గా ఉండాల‌ని, ఎలాంటి ఆప‌ద వ‌చ్చినా వెంట‌నే ప‌రిష్క‌రించాల‌ని కోరారు.

ఫేక్ వీడియో షేర్ తో సంబంధం లేదు.. ఢిల్లీ పోలీసులకు రేవంత్ రిప్లై
తల్లీదండ్రులు మట్టి కార్మికులు.. 973 మార్కులు సాధించిన శ్రావణి.. ఈమె సక్సెస్ కు ఫిదా అవ్వాల్సిందే!

ఇక రానున్న మ‌రో రోజుల పాటు న‌గ‌ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉన్నందున ప్ర‌తి ఒక్క శాఖ అల‌ర్ట్‌గా ఉండి ప్ర‌జ‌ల‌కు సేవ‌లందించాల‌ని ఆయ‌న వివ‌రించారు.

Advertisement

తాజా వార్తలు