దాదాపుగా కొందరి నిత్యావసరమైన లిస్టులోకి పెట్రోల్, డిజిల్తో పాటుగా మద్యం చేరిపోయింది.ఒక్క రోజు తిండి తినక పోయినా బాధ పడరు కానీ లీటర్ ఇంధనం, ఓ క్వాటర్ సీసా దొరక్కపోతే మాత్రం ప్రపంచమే మునిగిపోయిందనే తీరులో ఫీలయ్యే మహానుభావులున్న దేశం మనది.
ఇక ఉచితంగా ఇవ్వవలసి వస్తే ఎన్నికల సమయంలో మందు మాత్రం పక్కాగా ఫ్రీగా దొరకడం తెలిసిందే.కానీ పెట్రోల్, డిజిల్ మాత్రం ఫ్రీగా అందడం చాలా చాలా అరుదు.
అయితే కరోనా కష్టకాలంలో కష్టాల్లో ఉన్న ఆటోవాలాలకు అండగా నిలవాలని నిర్ణయించుకున్నారట కేరళ రాష్ట్రంలోని కాసర్గోడ్ జిల్లా ఎన్మకాజె గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న ఓ ఫ్యూయల్ స్టేషన్ యజమానులు.ఈ నేపధ్యంలో రెండురోజుల పాటుగా ఆటో వాలాలకు మూడు లీటర్ల చొప్పున ఉచిత ఇంధనం ఆఫర్ ప్రకటించారు.
ఇంకేముంది ఈ ఆఫర్ను వినియోగించుకోవడానికి ఆటోవాలాలు ముందుకొచ్చారట.