టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబు అటు సినిమా విషయంలోనే కాకుండా ఇటు ఫ్యామిలీ విషయంలో కూడా చాలా శ్రద్ధ తీసుకుంటాడు.పైగా టాలీవుడ్ ఇండస్ట్రీలో మహేష్ ఫ్యామిలీ.
అభిమానులకు చాలా దగ్గరగా ఉంటుంది.ఇక మహేష్ తనకు విరామం దొరికినప్పుడల్లా తన ఫ్యామిలీతో కలిసి బాగా సమయాన్ని గడుపుతాడు.
అప్పుడప్పుడు కొన్ని ట్రిప్స్ కూడా వేస్తుంటారు.ఇక తన భార్య తో నమ్రత కూడా సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటుంది.
ఇదిలా ఉంటే ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ వల్ల సినిమా షూటింగ్ వాయిదా పడటంతో సెలబ్రిటీలంతా తమ ఫ్యామిలీ లతో సంతోషంగా గడిపేస్తున్నారు.ఇక మహేష్ బాబు కూడా తన పిల్లలతో గడుపుతున్న సమయాన్ని సోషల్ మీడియా వేదికగా నమ్రత ఎప్పటికప్పుడు అభిమానులకు షేర్ చేస్తూనే ఉంటుంది.
ఇదిలా ఉంటే తాజాగా మహేష్ బాబు తన కూతురు తో చిల్ చేస్తున్నట్లు కనిపించింది.

తాజాగా నమ్రత తన ఇన్స్టా వేదికగా ఓ ఫోటో షేర్ చేయగా.అందులో మహేష్ బాబు తన కూతురు సితార తో కలిసి చిల్ చేస్తున్నట్లు కనిపించాడు.ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఇది చూసిన నెటిజనులు చాలా క్యూట్ గా ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు.ఇక మహేష్ బాబు ప్రస్తుతం సర్కారు వారి పాట సినిమాలో బిజీగా ఉన్నాడు.
ఈ సినిమా తరువాత డైరెక్టర్ త్రివిక్రమ్ తో మరో సినిమా చేయనున్నాడు.ఇక స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో కూడా మరో సినిమా చేయడానికి ఒప్పుకున్నట్లు తెలిసింది.
ప్రస్తుతం షూటింగులు వాయిదా పడటంతో మహేష్ బాబు ఇంట్లో ఉంటూ పిల్లలతో మంచి సమయం ను గడుపుతున్నట్లు తెలుస్తుంది.