హిందీలో అక్షయ్ కుమార్ హీరోగా ఓ మై గాడ్ అనే సినిమా 2012లో ప్రేక్షకుల ముందుకి వచ్చింది.ఉమేష్ శుక్ల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో దేవుడి గురించి ఓ అద్బుతమైన ఫిలాసఫీని చెప్పారు.
స్వామీజీల వేషాలలో కొంత మంది ప్రజలని ఎలా మోసం చేస్తున్నారు అనే విషయాన్ని తెరపై వినోదాత్మకంగా ఆవిష్కరించారు.ఈ నేపధ్యంలో ఆ సినిమా సూపర్ హిట్ అయ్యింది.
దీనిని తెలుగులో పవన్ కళ్యాణ్, వెంకటేష్ కాంబినేషన్ లో గోపాల గోపాల టైటిల్ తో రీమేక్ చేశారు.తెలుగులో కూడా ఈ మూవీ అద్బుతమైన విజయాన్ని అందుకుంది.
అలాగే కన్నడలో కిచ్చా సుదీప్, ఉపేంద్ర కాంబోలో ముకుందా మురారీ టైటిల్ తో రీమేక్ చేసి హిట్ కొట్టారు.
ఇలా మంచి సక్సెస్ ఫుల్ మూవీగా ప్రేక్షకుల మెప్పు పొందడంతో పాటు విమర్శకుల ప్రశంసలని కూడా సొంతం చేసుకున్న ఓ మై గాడ్ మూవీకి ఇప్పుడు సీక్వెల్ ప్లాన్ చేస్తున్నారు.
ఈ సీక్వెల్ లో అక్షయ్ కుమార్ తో పాటు పంకజ్ త్రిపాఠి ప్రధాన పాత్రలు పోషించనున్నట్లు తెలుస్తుంది.అమిత్ రాయ్ దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కనుందని టాక్.
ఇప్పటికే స్క్రిప్ట్ కూడా రెడీ అయిపోయిందని బోగట్టా.వచ్చే ఏడాది ఈ మూవీ సెట్స్ పైకి వెళ్ళే అవకాశం ఉందని బిటౌన్ లో వినిపిస్తుంది.
ఇదిలా ఉంటే ప్రస్తుతం అక్షయ్ కుమార్ హిందీలో సూర్యవంశీ, బెల్ బాటమ్ అనే సినిమాలని కంప్లీట్ రిలీజ్ కి రెడీ చేశాడు.మరో వైపు భారీ బడ్జెట్ తో రామ్ సేతు మూవీ తెరకెక్కుతుంది.
ఈ మూవీ షూటింగ్ దశలో ఉంది.దీనిని కంప్లీట్ చేసిన తర్వాత ఓ మై గాడ్ సీక్వెల్ స్టార్ట్ చేయనున్నట్లు సమాచారం.