ప్రముఖ నటి సురేఖా వాణి కూతురు సుప్రీత సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారనే సంగతి తెలిసిందే.భవిష్యత్తులో సుప్రీత హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తారో లేదో చెప్పలేం కానీ ప్రముఖ హీరోయిన్ల స్థాయిలో సుప్రీత ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకుంటున్నారు.
సురేఖా వాణి గురించి సోషల్ మీడియాలో, వెబ్ మీడియాలో తప్పుగా ప్రచారం జరిగితే వెంటనే ఖండిస్తూ వార్తల్లో నిలుస్తున్నారు.గతంలో సుప్రీత టిక్ టాక్ వీడియోలతో పాటు ఇన్ స్టాగ్రామ్ రీల్స్ కూడా చేశారు.
సుప్రీతకు సినిమా ఆఫర్లు కూడా వస్తున్నాయని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.గతంలో తల్లితో కలిసి సుప్రీత డ్యాన్స్ చేసిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి.
తాజాగా నెటిజన్లతో ముచ్చటించిన సుప్రీత నెటిజన్లు అడిగిన ఎన్నో ప్రశ్నలకు ఆసక్తికరమైన సమాధానాలను ఇచ్చారు. ప్రేమ పెళ్లి చేసుకుంటారా లేక పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకుంటారా అనే ప్రశ్నకు ప్రేమ పెళ్లి చేసుకుంటానని సుప్రీత బదులిచ్చారు.

పబ్స్ ను , నైట్ లైఫ్ ను మిస్సవుతున్నారా అనే ప్రశ్నకు యస్ అని ఆమె సమాధానం ఇచ్చారు.ఆ తరువాత ఒక నెటిజన్ ఆర్ యూ వర్జిన్ అని సుప్రీతను ప్రశ్నించారు.ఆ ప్రశ్నకు వకీల్ సాబ్ సినిమాలోని ఒక సీన్ ను షేర్ చేస్తూ సుప్రీత ఆ ప్రశ్న అడిగిన నెటిజన్ కు షాక్ ఇచ్చారు.ప్రభాస్, పవన్ లలో ఎవరు ఇష్టమనే ప్రశ్నకు పవన్ కళ్యాణ్ పేరును సుప్రీత సమాధానంగా ఇవ్వడం గమనార్హం.
తండ్రి లేకపోవడాన్ని తాను ఇప్పటికీ మిస్ అవుతూ ఉంటానని సుప్రీత వెల్లడించారు.తండ్రి మృతి చెందిన సమయంలో దేవుడు తన పక్కన ఉన్నాడేమోనని అందుకే తనకు చాలా స్ట్రెంత్ వచ్చిందని సుప్రీత నెటిజన్ల ప్రశ్నలకు సమాధానాలను వెల్లడించారు.