కరోనా కారణంగా ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో పరీక్షలను వాయిదా వేశారు.కొన్నిచోట్ల పరీక్షలను రద్దు చేశారు.
అయితే చత్తీస్ గడ్ లో మాత్రం పరీక్షలను ఇంటి దగ్గరే పరీక్షలను ఏర్పాటు చేస్తున్నారు.చత్తీస్ గడ్ లో 12వ తరగతి విధ్యార్ధులకు ఇంటి దగ్గరే పరీక్షలను రాసే వెసులుబాటు కల్పించారు.రాష్ట్రంలో ఉన్న 2.90 లక్షల మంది విధ్యార్ధులు ఇంటి దగ్గర పరీక్షలు రాయనున్నారని తెలుస్తుంది.ఓపెన్ బుక్ పరీక్ష విధానానికి సంబందించిన మార్గదర్శకాలను చతీస్ గడ్ ప్రభుత్వం రిలీజ్ చేసింది.
ఓపెన్ బుక్ విధానంలో విధ్యార్ధులు పరీక్ష రాయాలని నిర్ణయించారు.
జూన్ 1 నుడి 5వ తారీఖు వరకు పరీక్ష పత్రాన్ని తీసుకెళ్లొచ్చు.పరీక్ష రాసే 5 రోజులకు ఆన్సర్ షీట్ ఇన్విజిలేటర్ కు ఇవ్వాల్సి ఉంటుంది.
జూన్ 6న స్టూడెంట్స్ వారి ఆన్సర్స్ ను సమర్పించాల్సి ఉంటుంది. ఆన్సర్ షీట్స్ ను స్వయంగా స్టూడెంట్స్ వారే తీసుకెళ్లి తమ స్కూళ్లలో ఇన్విజిలేటర్ కు ఇవ్వాల్సి ఉంటుంది.
ఇతర రాష్ట్రాలకు భిన్నంగా చత్తీస్ గడ్ లో వినూత్నంగా ఈ పరీక్ష విధానం కొత్తగా ఉంది. ఈ ప్రాసెస్ వర్క్ అవుట్ అయితే అన్ని రాష్ట్రాలు కూడా ఇదే విధానం ఫాలో అయ్యే అవకాశం ఉంది.







