బుల్లితెర రియాలిటీ షోలకు ప్రేక్షకుల ఆదరణ ఎప్పుడూ ఉంటుందనే ఉంటుందనే సంగతి తెలిసిందే.ప్రస్తుతం స్టార్ మా ఛానెల్ లో డ్యాన్సీ ప్లస్ పేరుతో రియాలిటీ షో ప్రసారమవుతోంది.
బుల్లితెర యాంకర్ ఓంకార్ ఈ షోకు హోస్ట్ గా వ్యవహరిస్తూ ఉండటం గమనార్హం.ముమైత్ ఖాన్, మోనాల్ గజ్జర్, యశ్ మాస్టర్ తో పాటు మరి కొందరు ఈ షోకు జడ్జీలుగా వ్యవహరిస్తున్నారు.ఈ వీకెండ్ లో డాన్స్ ప్లస్ షో ఫినాలే ప్రసారం కానుందని తెలుస్తోంది.
12 మంది కంటెస్టెంట్ల గ్రూప్ లతో ఈ షో ప్రారంభం అయింది.సంకేత్ సహదేవ్ ఈ షో విన్నర్ గా జియా థాకూర్ రన్నర్ గా నిలిచారని సమాచారం.విన్నర్ ప్రైజ్ మనీ 20 లక్షల రూపాయలు కాగా రన్నర్ ప్రైజ్ మనీ ఎంతో తెలియాల్సి ఉంది.
ప్రతి శని, ఆదివారం రోజులలో ప్రసారమవుతున్న ఈ షో ప్రేక్షకులను ఆకట్టుకుంది.ఈటీవీలో ప్రసారమవుతున్న ఢీ షోకు పోటీగా మొదలైన ఈ షో మంచి టీఆర్పీ రేటింగ్ లను సొంతం చేసుకుంది.

ఓంకార్ తనదైన శైలి యాంకరింగ్ తో, గొడవలతో షోపై ప్రేక్షకుల్లో అంచనాలు పెరిగేలా చేశారు.విన్నర్ సంకేత్ యశ్వంత్ మాస్టర్ టీమ్ కు చెందిన వ్యక్తి కాగా రన్నర్ జియా థాకూర్ అనీ మాస్టర్ టీమ్ కు చెందిన వ్యక్తి కావడం గమనార్హం.ఈ వీకెండ్ ఎపిసోడ్లతో డ్యాన్సీ ప్లస్ సీజన్ 1 ముగిసే అవకాశం ఉండగా వచ్చే ఏడాది ఈ షో రెండో సీజన్ మొదలయ్యే అవకాశాలు ఉంటాయి.
బిగ్ బాస్ రియలిటీ షో ద్వారా పాపులారిటీని సంపాదించుకున్న మోనాల్ డాన్స్ ప్లస్ షో ద్వారా పాపులారిటీని పెంచుకున్నారు.
ఈ షో స్థానంలో రాబోయే వారాల్లో ఏ షో ప్రసారమవుతుందనే వివరాలు తెలియాల్సి ఉంది.