నయనతారతో మాతృదేవోభవ రీమేక్ పై ఆసక్తి చూపిస్తున్న నిర్మాత

ఒకప్పటి గ్లామర్ బ్యూటీ పూర్తి ట్రెడిషనల్, మధ్యతరగతి గృహిణి పాత్రలో మాధవి నటించిన మాతృదేవోభవ సినిమా గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.30 ఏళ్ల క్రితం వచ్చిన ఈ సినిమా ఇప్పటికి టెలివిజన్ లో ప్రసారం అయితే ఇంట్లో ఆడవాళ్ళు టీవీలకి అతుక్కుపోయి మరీ చూస్తారు.

ఇక సినిమాలో రెండో అర్ధ భాగం అయితే క్లైమాక్స్ వరకు ప్రతి ఒక్కరిని కన్నీళ్లు పెట్టిస్తూనే ఉంటుంది.

ఇక సినిమాలో మాధవి చేసిన తల్లి పాత్రకి అప్పట్లో విపరీతమైన ప్రశంసలు లభించాయి.ఇక ఈ సినిమా ఎన్నో అవార్డులు, రివార్డులు సొంతం చేసుకోవడంతో పటు ఒక క్లాసిక్ మూవీగా ఇప్పటికి నిలిచిపోయింది.

అందులో చైల్డ్ ఆర్టిస్ట్ లుగా నటించిన వారిలో కొందరు ఇప్పుడు సినిమాలలో నటులుగా రాణిస్తున్నారు.ఇక ఈ సినిమా ఇండియన్ బాషలన్నింటిలో రిలీజ్ అయ్యింది.ముందుగా మలయాళంలో మాధవి లీడ్ రోల్ లోనే ఈ సినిమా తెరకెక్కింది.

దానిని కె.ఎస్.రామారావు తెలుగులో రీమేక్ చేశారు.కె అజయ్ కుమార్ దర్శకత్వంలో ఆ సినిమా తెరకెక్కింది.

Advertisement

తక్కువ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకొని భారీ కలెక్షన్స తెచ్చిపెట్టడమే కాకుండా సినిమాలో పాటలకి గాను వేటూరికి నేషనల్ అవార్డు వచ్చింది.ఇక ఈ సినిమా మలయాళీ మాతృకకి కూడా నేషనల్ అవార్డు వచ్చింది.30 ఏళ్ల తర్వాత మళ్ళీ ఇప్పుడు మాతృదేవోభవ సినిమా రీమేక్ చేయాలనే నిర్మాత కె.ఎస్.రామారావు ప్లాన్ చేస్తున్నారు.తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని ఆయన చెప్పడం విశేషం.

ప్రస్తుతం ఉన్న హీరోయిన్స్ లో నయనతార, కీర్తి సురేష్, అనుష్క ఆ పాత్రకి న్యాయం చేయగలరని చెప్పుకొచ్చారు.అన్ని అనుకున్నట్లు జరిగితే అజయ్ కుమార్ దర్శకత్వంలో నయనతారతో ఆ సినిమాని రీమేక్ చేస్తానని చెప్పుకొచ్చారు.

Advertisement

తాజా వార్తలు