తెలుగులో ప్రముఖ ఎంటర్ టైన్ మెంట్ చానల్ అయినటువంటి ఈటీవీలో ప్రసారమయ్యే జబర్దస్త్ కామెడీ షో ద్వారా పాపులర్ అయినటువంటి కమెడియన్లలో తెలుగు ప్రముఖ కమెడియన్ పొట్టి రమేష్ ఒకరు.అయితే చిన్నప్పటినుంచి పొట్టి రమేష్ కి జన్యులోపం కారణంగా ఎక్కువగా ఎత్తు పెరగలేకపోయాడు.
కానీ నటన పరంగా మంచి ప్రతిభ ఉండటంతో సినిమాల్లో నటించాలని సినిమా పరిశ్రమకి వచ్చాడు.కానీ పెద్దగా సినిమా ఛాన్సులు రాకపోవడంతో పలు షోలు, ఈవెంట్లలో కమెడియన్ గా నటించి బాగానే గుర్తింపు తెచ్చుకున్నాడు.
అయితే చేతినిండా అవకాశాలు కెరీర్ బాగానే సాగిపోతున్న సమయంలో తన దగ్గరి బంధువుల అమ్మాయి త్రిపురాంబిక ను పెళ్లి చేసుకున్నాడు.పెళ్లయిన కొత్తలో వీరిద్దరు ఎంతో అన్యోన్యంగా ఉండేవారు.
కానీ ఏమైందో ఏమో గాని కొంతకాలానికి అనుకోకుండా త్రిపురాంబిక పొట్టి రమేష్ ఇంట్లో ఆత్మహత్య చేసుకుంది.దీంతో ఒక్కసారిగా ఈ విషయం టాలీవుడ్ సినిమా పరిశ్రమలో అప్పట్లో కలకలం రేకెత్తించింది.

అయితే త్రిపురాంబిక తల్లిదండ్రులు మాత్రం తమ కూతురి మరణానికి తన అత్తమామలు కారణం అంటూ అప్పట్లో పొట్టి రమేష్ తల్లిదండ్రులపై పలు ఆరోపణలు చేశారు.అంతేకాకుండా ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు.దీంతో ఈ సంఘటన జరిగినప్పటి నుంచి పొట్టి రమేష్ సినిమా పరిశ్రమకి దూరంగా ఉంటున్నాడు.
అంతే కాకుండా తన భార్య మరణంతో కుంగిపోయిన పొట్టి రమేష్ సినిమా కెరియర్ పై కూడా పెద్దగా దృష్టి సారించ లేకపోయాడు.
దీంతో ప్రస్తుతం అతడు ఎక్కడ ఉన్నాడు.? ఎలా ఉన్నాడనే విషయాలు ఇంకా తెలియాల్సి ఉంది.అయితే పొట్టి రమేష్ పలు చిత్రాలలో మరియు ధారావాహికలలో కూడా అప్పుడప్పుడు కనిపించాడు ఇందులో ముఖ్యంగా జబర్దస్త్ మరియు స్టార్ మా ఛానల్ లో ప్రసారమయ్యే భలే చాన్సులే అనే షోలో కూడా నటించాడు.