తాగి వాహనాలు నడపరాదు.అలా చేస్తే మీతో పాటు ఎదుటి వారికి ప్రమాదం అని పోలీసులు నిత్యం హెచ్చరిస్తున్నారు.
తాగి బండితో రోడ్డు మీదకు వచ్చే వాడికి ఉగ్రవాదికి పెద్ద తేడా లేదని చెప్తున్నారు.ఇద్దరూ జనాల ప్రాణాలు తీస్తారని అవగాహన కల్పిస్తున్నారు.
పోలీసులు ఎన్నిసార్లు చెప్పినా కొందరి చెవికి మాత్రం ఎక్కడం లేదు.పీకల దాకా తాగి రోడ్డు మీదకి ఎక్కుతున్నారు.
అడ్డంగా దొరికి కేసుల పాలవుతున్నారు.ఈ లిస్టులో సినిమా తారలు కూడా ఉండటం విశేషం, ఇంతకీ డ్రంకెన్ డ్రైవ్ కేసులో ఖాకీలకు చిక్కిన సినీ జనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
నవదీప్

టాలీవుడ్ యంగ్ హీరో నవదీప్ ఓసారి పార్టీకి వెళ్లి వస్తుండగా పోలీసులు ఆపారు.మద్యం తీసుకున్నట్లు గుర్తించిన పోలీసులు కారు స్వాధీనం చేసుకున్నారు.ఫైన్ వేశారు.అనంతరం కౌన్సెలింగ్ ఇచ్చి పంపించారు.
నిఖిల్

ఈ కుర్ర హీరో తాగి పోలీసులకు చిక్కి ఓ రాత్రంతా పోలీస్ స్టేషన్ లో గడిపాడు.కొద్ది రోజులు తన డ్రైవింగ్ లైసెన్స్ కూడా రద్దు అయ్యింది.
శివ బాలాజి

మంచి ఫ్యామిలీ నటుడిగా గుర్తింపు పొందిన ఇతడు కూడా 2012లో తాగి పోలీసులకు చిక్కాడు.ఆ సమయంలో మీడియా మీద కూడా ఆగ్రహం వెళ్లగక్కాడు.
సాయి రోహిత్

అప్పుడే సినిమాల్లో రాణిస్తున్న ఇతడు ఎలైట్ క్లబ్‌లో తాగి జూబ్లీ హిల్స్ దగ్గర పోలీసులకు దొరికాడు.పోలీసులు అతడికి ఫైన్ వేసి కౌన్సెలింగ్ ఇచ్చాడు పంపించారు.
భరత్

రవితేజ తమ్ముడు భరత్ పలు కేసుల్లో అరెస్టు అయ్యాడు.రెండుసార్లు తాగి కారు నడుపుతూ పట్టుబడ్డాడు.డ్రగ్స్ కేసులోనూ అరెస్టు అయ్యాడు.
కోన వెంకట్

సినిమా రచయిత, నిర్మాత అయిన వెంకట్ తాగి పోలీసులకు చిక్కాడు.అతడికి పైన్ వేసి కౌన్సిలింగ్ ఇచ్చిపంపించారు.
బిబిఎస్ రవి

తొలుత మద్యం తాగి పోలీసులకు దొరికిన రవి.ఆ తర్వాత ఎవరూ అలా చేయకూడదంటూ ప్రచారం చేస్తున్నాడు.
రాజా రవీంద్ర

పీకల దాకా తాగి పోలీసులకు చిక్కి కోర్టుకు వెళ్లాడు ఈ నటుడు.ఆ తర్వాత తాగి రోడ్డు మీదకు రావడం మానేశాడు.
యాంకర్ ప్రదీప్

యాంకర్ ప్రదీప్ కూడా తాగి పోలీసులకు పట్టుబడ్డాడు.కొద్ది రోజుల తర్వాత కౌన్సిలింగ్ కు వెళ్లాడు.
షణ్ముఖ్ జశ్వంత్

యూట్యూబ్ స్టార్ గా పేరు తెచ్చుకున్న ఈ నటుడు ఇటీవలే పూటుగా దాగి రోడ్ పైన వెళ్లే వాళ్ల ప్రాణాలపైనకి తెచ్చినంత పని చేసాడు
.