తమ అభిమాన హీరో ఎందుకు చేసాడు ఈ సినిమా అంటూ ఫ్యాన్స్ తలపట్టుకున్న సినిమాలు

సినిమాలు అన్నాక విజ‌యాలు, ప‌రాజ‌యాలు కామ‌న్.మంచి సినిమాలు హీరోను పైకి తీసుకెళ్తే.

చెత్త సినిమాలు అదే హీరోల‌ను బోల్తా కొట్టిస్తాయి. తెలుగు సినిమా రంగంలో బ్లాక్ బ‌స్ట‌ర్లు చూసిన హీరోలే.

డిజాస్ట‌ర్లు దెబ్బ‌నూ అనుభ‌వించారు.అస‌లు ఈ సిమాలు ఎందుకు చేశారా అన ప్రేక్ష‌కుల‌కు అనిపించిన సినిమాలు ఉన్నాయి.అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం!

చిరంజీవి:

చిరు హీరోగా 1995లో రిలీజైన రిక్షావోడు సినిమా డిజాస్ట‌ర్ అయ్యింది.డ్యూయెల్ రోల్ చేసినా ప్రేక్ష‌కులు ఆద‌రించ‌లేదు.సినిమాస్టోరీ బాగా లేక‌పోవ‌డం.ఈ సినిమాలో చిరంజీవి రిక్షావాడిగా క‌నిపించ‌డం అభిమానుల‌కు న‌చ్చ‌లేదు.2001లో వచ్చిన మృగరాజు సైతం డిజాస్ట‌ర్‌గా మిగిలింది.

బాలకృష్ణ:

Advertisement

1997లో వ‌చ్చిన దేవుడు సినిమా బిగ్గెస్ట్ డిజాస్ట‌ర్‌గా మిగిలింది.ఆయ‌న క్యారెక్ట‌ర్ ప్రేక్ష‌కుల‌కు ఏమాత్రం ఎక్కలేదు.2003లో వ‌చ్చిన పల్నాటి బ్రహ్మ నాయుడు సైతం ఇదే కోవ‌లోకి చేరింది.తొడకోడితే ట్రైన్ వెనక్కి వెళ్ల‌డం అస్స‌లు న‌చ్చ‌లేదు.

నాగార్జున:

నాగార్జున ‌కెరీర్‌లోనూ కొన్ని పిచ్చి సినిమాలు ఉన్నాయి.2001లో వ‌చ్చిన బావ నచ్చాడు, 2010లో వ‌చ్చిన కేడి, 2013లో వ‌చ్చిన భాయ్ సినిమాలు అట్ట‌ర్ ఫ్లాప్ అయ్యాయి.ఈ సినిమాల‌తో ప్రేక్ష‌కుల‌కు త‌ల‌నొప్పి వ‌చ్చింది.

వెంకటేష్:

వెంకటేష్ కెరీర్ లో అత్య‌తం డిజాస్ట‌ర్ 2019 వ‌చ్చిన షాడో మూవీ. ఎప్పుడూ చ‌క్క‌టి స్టోరీల‌ను సెలెక్ట్ చేసుకునే వెంక‌టేష్‌ ఈ సినిమా ఎందుకు చేశాడో అర్థంకాదు.

పవన్ కళ్యాణ్ :

కొమ‌రంపులి లాంటి సినిమాలు ప‌వ‌న్ క‌ళ్యాణ్ కెరీర్‌లో తీవ్ర న‌ష్టాన్ని క‌లిగించాయి.ఈ సినిమా ప్రేక్ష‌కుల‌నే కాదు ఫ్యాన్స్ ను కూడా ఆక‌ట్టుకోలేక‌పోయింది.అజ్ఞాతవాసి కూడా ఇదే కోవ‌కు చెందిన మూవీగా నిలిచింది.

మహేష్ బాబు :

మిల్క్ పౌడర్‌లో వైన్ కలిపిన అమ్మమ్మ.. కోమాలోకి వెళ్లిపోయిన పిల్లోడు..??
ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?

మ‌హేష్ బాబుకు కెరీర్‌లో ఫ్లాప్ బ్ర‌హ్మోత్స‌వం.ఈ సినిమా ప్రేక్ష‌కుల‌ను ఏమాత్రం ఆక‌ట్టుకోలేదు.

జూ.ఎన్టీఆర్‌:

Advertisement

ఇండ‌స్ట్రీలోకి వ‌స్తూనే మంచి సినిమాలు చేసిన జూ.ఎన్టీఆర్‌.ప‌లు చెత్త సినిమాల్లోనూ న‌టించాడు.2005లో వ‌చ్చిన నా అల్లుడు, 2011లో వ‌చ్చిన శక్తి సినిమాలు డిజాస్ట‌ర్లుగా మిగిలాయి.త‌న బాడీ లాంగ్వేజ్ కు సూట్ కాని క్యారెక్టర్ల‌లో ఎన్టీఆర్‌ను ప్రేక్ష‌కులు చూడ‌లేక‌పోయార‌.

రామ్ చరణ్:

మెగా స్టార్ త‌న‌యుడు న‌టించిన తుఫాన్ ఓ పెద్ద డిజాస్ట‌ర్.ఈ సినిమా ఎప్పుడొచ్చిందో ఎప్పుడు పోయిందో కూడా తెలియ‌దు.

అల్లు అర్జున్:

మంచి హిట్ సినిమాలు చేసిన బ‌న్నికి వ‌రుడు పెద్ద దెబ్బ కొట్టింది.2010లో వ‌చ్చిన ఈ సినిమాను అల్లు అర్జున్ ఎందుకు చేశాడో అర్థం కాదు.

రవితేజ:

అమర్ అక్బర్ ఆంటోనీ సినిమాలో రవితేజ ఎలా న‌టించాడో అర్థం కాదు.ఇది డిజాస్ట‌ర్ల‌కే డిజాస్ట‌ర్ మూవీ.

తాజా వార్తలు