మెగా బ్రదర్ నాగబాబు కూతురు నిహారిక పెళ్లికి ముందు, పెళ్లి తరువాత సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తరచూ పోస్ట్ లు చేస్తున్న సంగతి తెలిసిందే.మూడు సినిమాల్లో హీరోయిన్ గా నటించి గుర్తింపును సంపాదించుకున్న నిహారిక కొన్ని వెబ్ సిరీస్ లలో కూడా నటించారు.
పలు టీవీ షోలకు యాంకర్ గా వ్యవహరించిన నిహారిక టీవీ ఛానెళ్లు నిర్వహించే ఈవెంట్లలో కూడా పాల్గొంటూ సందడి చేస్తున్నారు.
తాజాగా నిహారిక సోషల్ మీడియాలో ఒక ఫోటోను షేర్ చేయడంతో పాటు ఆ డ్రెస్ ను డిజైన చేసిన వాళ్ల పేర్లు, ఇతర వివరాలను తెలుగులో టైప్ చేశారు.
నిహారిక తెలుగులో టైప్ చేయడం గురించి, ఫోటో గురించి నిహారిక భర్త చైతన్య జొన్నలగడ్డ షాకింగ్ కామెంట్లు చేశారు.గోవిందుడు అందరి వాడేలే సినిమాలోని గులాబీ కళ్లు రెండు ముళ్లు చేసి గుండెలోకి గుచ్చుతున్నావె పాటను టైప్ చేశారు.
నిహారిక షేర్ చేసిన ఫోటోకు లక్షల సంఖ్యలో లైకులు వస్తున్నాయి.నిహారిక తెలుగులో పదాలు టైప్ చేయడం గురించి నెటిజన్లు సైతాం ప్రశంసలు వ్యక్తం చేస్తున్నారు.
మరోవైపు నిహారిక సినిమాల్లోకి రీఎంట్రీ ఇవ్వనున్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది.ఇప్పటికే నిహారిక ఒక సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు ఇండస్ట్రీ వర్గాల్లో ప్రచారం జరుగుతుండగా ఈ మేరకు అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

నిహారిక తెలుగులో పోస్ట్ పెట్టడంపై కళ్యాణ్ దేవ్ కూడా ప్రశంసలు కురిపించారు.నీహా, నువ్వు ఇంత బాగా తెలుగు రాయగలవని నాకు తెలియదు అంటూ కళ్యాణ్ దేవ్ కామెంట్ పెట్టడం గమనార్హం.నిహారిక అనసూయతో కలిసి ఒక వెబ్ సిరీస్ లో నటిస్తుండగా ఆ వెబ్ సిరీస్ ఎప్పుడు రిలీజ్ అవుతుందో తెలియాల్సి ఉంది.







