అమాంతం పెరిగిన రైల్వే ప్లాట్ ఫాం టికెట్ ధరలు.. అందుకేనా..?!

దేశంలో కరోనా వైరస్ మరోసారి తీవ్ర రూపం దాలుస్తోంది.పలు ప్రాంతాల్లో కేసుల సంఖ్య పెరుగుతుండటంతో ప్రభుత్వాలు చర్యలు ప్రారంభించాయి.

ఇప్పటికే మహారాష్ట్ర, కేరళ ప్రాంతాల్లో కేసులు పెరుగుతుండటంతో.ప్రభుత్వాలు ఆంక్షలు విధించాయి.

మహారాష్ట్రలో పలు ప్రాంతాల్లో లాక్‌డౌన్ కూడా విధించారు.ఈ నేపథ్యంలో మెట్రోపాలిటిన్ ప్రాంతాల్లో వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కూడా చర్యలు ప్రారంభించింది.ఇక ప్లాట్‌ఫామ్ టికెట్ ధరను రూ.10 నుంచి ఏకంగా రూ.50కి పెంచుతూ రైల్వే నిర్ణయం తీసుకుంది.ముంబై మెట్రోపాలిటన్ ప్రాంతాల్లో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంతో రద్దీని తగ్గించడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు సెంట్రల్ రైల్వే వెల్లడించింది.మెట్రోపాలిటిన్ సిటీల్లో ప్లాట్‌ఫామ్ టిక్కెట్ ధరను రూ.10 నుంచి ఏకంగా 50 రూపాయలకు పెంచినట్లు అధికారులు వెల్లడించారు.ప్లాట్‌ఫారం టికెట్‌ ధరను రైల్వే ఏకంగా రూ.50కి పెంచేసింది.ఒకవైపు కరోనా, మరోవైపు పెరుగుతున్న ధరలతో ఇప్పటికే ముంబైకర్లు సతమతమవుతుంటే ప్రభుత్వం పెంచిన ప్లాట్‌ఫారం టికెట్ల ధరలు వారికి అశనిపాతంగా మారాయి.

గత కొద్ది రోజులుగా ముంబై పరిసర నగరాల్లో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్న దృష్టా, ప్రభుత్వం అనవసరమైన అధిక రద్దీని తగ్గించేందుకు తగిన చర్యలు చేపడుతోంది.అందులో భాగంగానే రైల్వే స్టేషన్స్‌లో ప్రయాణీకులతో పాటు అనవసరంగా జనం గుంపు కడుతున్నారనీ, జనాల రద్ధీని తగ్గించేందుకు ప్లాట్‌ఫారం టికెట్ల ధరలు అమాంతం పెంచేసి యాభై రూపాయలు చేసింది.

Advertisement

గతంలో ఈ ప్లాట్‌ఫారం టికెట్‌ ధర పది రూపాయలు ఉండేది.నిజానికి ధరలు పెంచాలనే నిర్ణయం 24 ఫిబ్రవరి రోజే తీసుకున్నామనీ, ఈ పెంచిన ధరలు జూన్‌ 15 వరకు అమలులో ఉంటాయని మధ్య రైల్వే ప్రధాన పౌర సంబంధాల అధికారి శివాజీ సుతార్‌ తెలిపారు.

ముంబై మహానగరంలోని ఛత్రపతి శివాజీ మహారాజ్‌ టెర్మినస్, దాదర్, లోకమాన్య తిలక్‌ టెర్మినస్, థానే, కల్యాణ్, పన్వేల్, భివండీ రోడ్‌ స్టేషన్‌లలో ప్లాట్‌ ఫారం టికెట్ల ధరలు యాభై రూపాయలు ఉంటాయనీ, ఇవే స్టేషన్‌లలో రద్దీని తగ్గించేందుకు రేట్లను పెంచామనీ ఆయన అన్నారు.

Advertisement

తాజా వార్తలు