తమిళ యువ నటుడు ఆర్య తెలుగు ప్రేక్షకులకు బాగా తెలుసు.నయనతార, ఆర్య కలిసి నటించిన రాజా రాణి సినిమా ద్వారా తెలుగులో మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు.
అయితే ఈయన 2019లోనే హీరోయిన్ సయేషా ను పెళ్లి చేసుకున్నాడు.అయితే తాజాగా ఆర్య పై చీటింగ్ కేసు నమోదైనట్లు తెలుస్తుంది.
ఈయన పై శ్రీలంకకు చెందిన ఒక యువతీ మద్రాసు కోర్టులో ఫిర్యాదు చేసినట్టు సమాచారం.ఈ విషయంపై ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.ఆర్య తనను పెళ్లిచేసుకుంటానని 80 లక్షలు తీసుకుని నన్ను మోసం చేసాడని ఒక యువతీ పోలీసులకు ఫిర్యాదు చేసింది.లాక్ డౌన్ సమయంలో ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్నాడని ఆర్య తన దగ్గర డబ్బులు తీసుకున్నాడని ఆ యువతీ ఫిర్యాదులో పేర్కొంది.ఈమె చెన్నైలో ఉద్యోగం చేస్తుంది.
చెన్నై కు చెందిన వ్యక్తి ద్వారా ఈమె ఆర్య ను కలిసినట్టు తెలిపింది.
ఆ వ్యక్తి సమక్షంలోనే ఆర్యకు డబ్బులు ఇచ్చినట్టు పోలీసులకు తెలిపింది.
లాక్ డౌన్ కారణంగా ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్నానని అయన చెప్పడంతో డబ్బులు ఇచ్చినట్టు తెలిపింది.అంతేకాదు ఆర్య తనని పెళ్లి చేసుకుంటానని హామీ కూడా ఇచ్చాడని వెల్లడించింది.
తర్వాత నన్ను మోసం చేసాడని.నన్ను మాత్రమే కాదు ఇంకా కొంతమంది యువతులను కూడా ఇలానే మోసం చేసాడని ఆరోపించింది.

డబ్బు తిరిగి ఇవ్వాలని అనేక సార్లు ఆర్యను, ఆయన తల్లిని కలిశానని కానీ వారు స్పందించలేదని వాళ్ళ పలుకుబడితో నాకు న్యాయం జరుగకుండా చేసారని తెలిపింది.అంతేకాదు ఇందుకు నా దగ్గర సాక్షాలు కూడా ఉన్నాయని ఫిర్యాదులో పేర్కొంది.ఈ క్రమంలో ముందస్తు బెయిల్ =కోసమని ఆర్య కోర్టును అశ్రయించినట్టు సమాచారం.ఆ యువతీ విషయం తెలుసుకుని ముందస్తు బెయిల్ అవ్వొద్దని కోర్టులో మరొక పిటిషన్ వేసింది.
ఈ కేసును కోర్టు ఏప్రిల్ 4 కు వాయిదా వేసినట్టు తెలుస్తుంది.