మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఆచార్య’ ఇప్పటికే శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోన్న సంగతి తెలిసిందే.ఈ సినిమాతో మరోసారి బాక్సాఫీస్ వద్ద హిట్ అందుకునేందుకు మెగాస్టార్ రెడీ అవుతున్నాడు.
కాగా ఈ సినిమాను దర్శకుడు కొరటాల శివ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లో కూడా అదిరిపోయే అంచనాలు క్రియేట్ అవుతున్నాయి.దీంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు రిలీజ్ చేస్తారా అని ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు.
కాగా ఈ సినిమాను వేసవి కానుకగా మే 13న రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.కాగా ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా కలకలం మరోసారి మొదలవడంతో, ఆచార్య చిత్రాన్ని వీలైనంత త్వరగా పూర్తి చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది.
దర్శకుడు కొరటాల శివ తన టీమ్ సభ్యులను ఈ సినిమా షూటింగ్ పనులతో పాటు మిగతా పనులు కూడా వీలైనంత త్వరగా పూర్తి చేయాలని ఆదేశించాడట.దీంతో కరోనా సెకండ్ వేవ్ వేగవంతం కాకముందే, ఆచార్య చిత్ర షూటింగ్‌ను ముగించాలని కొరటాల భావిస్తున్నాడు.
గతేడాదే పూర్తి కావాల్సిన ఈ సినిమా కరోనా లాక్‌డౌన్ కారణంగా వాయిదా పడింది.
దీంతో ఈసారి మరిన్ని అడ్డంకులు రాకముందే ఆచార్య చిత్రాన్ని ముగించేయాలని కొరటాల అండ్ టీమ్ ప్లాన్ చేస్తోంది.
మరి ఆచార్య చిత్రాన్ని ఈసారైనా అనుకున్న సమయానికల్లా పూర్తి చేసి, వేసవి కానుకగా రిలీజ్ చేస్తారా లేదా అనేది ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది.ఇక ఈ సినిమాలో చిరంజీవితో పాటు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఓ కేమియో రోల్‌లో నటిస్తున్న సంగతి తెలిసిందే.
ఈ సినిమాలో అందాల భామ కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోండగా, నిరంజన్ రెడ్డితో కలిసి చరణ్ ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నాడు.







