కరోనా కొన్ని రాష్ట్రల్లో మళ్లీ తన ప్రతాపాన్ని చూపెట్టడానికి సిద్దం అయ్యిందన్న విషయం విదితమే.కాగా ఊహించని విధంగా కొన్ని రాష్ట్రల్లో కరోనా కేసులు నమోదు అవుతున్నాయి.
ముఖ్యంగా మహారాష్ట్రలో ప్రాణాంతక కరోనా వైరస్ మరోసారి విజృంభిస్తోంది.కేసులు ఒక్కసారిగా పెరగడంతో ప్రజలను ఈ వైరస్ భయాందోళనకు గురి చేస్తుంది.
దాంతో కేంద్రం అప్రమత్తం అయి రాష్ట్రాలకు హెచ్చరికలు జారీ చేసింది.
కరోనా టెస్ట్‌లతో పాటుగా వ్యాక్సినేషన్ ప్రక్రియను కూడా పెంచాలంటూ కేంద్రం సూచించింది.
కాగా ఏడు రాష్ట్రాల్లో కరోనా వ్యాప్తి పెరుగుతోందని ఆ రాష్ట్రాల్లో 90శాతం కేసులు నమోదవుతున్నాయని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.ఈ క్రమంలో మహారాష్ట్రలో విజృంభిస్తున్న కరోనా వైరస్, కారణంగా నాగపూర్ లో ఈ నెల 15 నుండి 21 వరకు లాక్ డౌన్ విధిస్తున్నట్లుగా మహారాష్ట్ర ప్రభుత్వం వెల్లడింది.
ఇకపోతే దేశంలో అత్యధికంగా కరోనా పాజిటివ్ కేసులతో పాటుగా మరణాల సంఖ్యలో మహారాష్ట్ర మొదటి స్థానంలో ఉంది.ఆ తర్వాత కేరళ, పంజాబ్, తమిళనాడు, గుజరాత్, మధ్యప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో నమోదైనట్లు కేంద్రం వెల్లడించింది.







