ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు కు మరో షాక్ ఇచ్చిన ఏపీ ప్రభుత్వం..!!

చంద్రబాబునాయుడు హయాంలో ఇంటెలిజెన్స్ చీఫ్ ఆఫీసర్ గా విధులు నిర్వహించిన ఏబీ వెంకటేశ్వరరావు.

డిపార్టమెంట్ పరికరాలు కొనుగోలు విషయంలో అవినీతికి పాల్పడ్డారని, జగన్  ప్రభుత్వం ఆరోపిస్తూ సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే.

దేశ పరికరాలకు సంబంధించిన విషయాలను, రహస్యాలను ఇతర దేశస్థులకు చెప్పటం జరిగిందని…  దేశ ద్రోహం కింద ఏబీ వెంకటేశ్వరరావు పై వైసీపీ అధికారంలోకి వచ్చాక అనేక ఆరోపణలు చేయటం జరిగింది.కాగా వీటికి సంబంధించిన విషయాల పై విచారణ జరుగుతూ ఉండగా తాజాగా మరో విషయం పై ఏబీ వెంకటేశ్వరరావు పై విచారణ చేయడానికి జగన్ సర్కారు రెడీ అయింది.

మేటర్ లోకి వెళ్తే.అప్పట్లో పదవిలో ఉన్న సమయంలో పక్షపాత ధోరణితో.

ప్రతిపక్ష పార్టీ వైసీపీ ని వేదించారు అన్న విషయంపై విచారణ చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజాగా ఆదేశాలు జారీ చేసింది.ఈ బాధ్యతను సీనియర్ ఐఏఎస్ అధికారి ఆర్ పి సిపొడియా కు అప్పగించింది.

Advertisement

అఖిల భారత సర్వీసు నిబంధనలు 1969 అనుసరించి ఈ మేరకు విచారణ చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సన్నాహాలు చేస్తుందంటూ వివరణ ఇచ్చింది.ఇదిలా ఉంటే.

ఐఏఎస్ అధికారి ఎదుట ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించడానికి సర్వ శ్రీనివాసరావు నీ ప్రజెంటింగ్ అధికారిగా.ప్రభుత్వం నియమించింది.

Advertisement

తాజా వార్తలు