తెలంగాణలో బీజేపీ అనుకున్నంత స్థాయికి వెళ్లకున్నా టీఆర్ఎస్ కు చెక్ పెట్టగలిగే స్థాయికి చేరుకుందని చెప్పవచ్చు.అయితే కాంగ్రెస్ కుమ్ములాటలతో బలహీనపడ్డ పరిస్థితులలో బీజేపీ కాంగ్రెస్ స్థానాన్ని భర్తీ చేసింది.
అయితే గత కొద్ది కాలంగా టీఆర్ఎస్ పై మాటల తూటాలతో విరుచుకపడిన బీజేపీకి, టీఆర్ఎస్ కౌంటర్ ఇవ్వకుండా మౌనం పాటించింది.అయితే బీజేపీకి ఇన్నాళ్లుగా మాటకు మాట ఇవ్వకుండా మౌనం పాటించారు.
అయితే బీజేపీ కేసీఆర్ నే కాకుండా, కేటీఆర్ ను కూడా తీవ్ర స్థాయిలో విమర్షించింది బీజేపీ.
అయితే ఇప్పుడు బీజేపీపై కేటీఆర్ అస్త్రాలను సిద్ధం చేసే పనిలో పడ్డట్టు సమాచారం.
అయితే టీఆర్ఎస్ మౌనంగా ఉండడం వల్ల బీజేపీ ఎన్ని ఆరోపణలు చేస్తున్నా మౌనంగా ఉండటం వల్ల ప్రజలు అవి నిజమనుకునే ప్రమాదం ఉంది.అయితే ఒక్కొక్కటిగా బీజేపీ ఆరోపణలపై ఘాటుగా స్పందించి బీజేపీని దోషిగా నిలబెట్టాలన్నది కేటీఆర్ వ్యూహం.
ఐతే ఈ దెబ్బతో బీజేపీని గట్టిగా దెబ్బ కొట్టి మరల టీఆర్ఎస్ ను ఒకప్పటి స్థాయికి తీసుకురావాలన్నది టీఆర్ఎస్ వ్యూహంలా కనిపిస్తోంది.అయితే ఇక కేటీఆర్ రంగంలోకి దిగాక బీజేపీ, టీఆర్ఎస్ మాటల తూటాల మధ్య రాజకీయ వాతావరణం వేడెక్కనుంది.
ఇక మరి తెలంగాణ రాజకీయాలు ఇంకా ఎన్ని సంచలనాలకు దారి తీయనున్నాయో చూడాల్సి ఉంది.