ఇలా చేస్తే సంవత్సరానికి 40 లక్షలు సంపాదించవచ్చట.. ఆ వ్యాపారం ఏంటంటే.. ?

నేటి కాలంలో వ్యాపారం ఏదైతే ఏంది సంపాదన ముఖ్యం అని భావించే వారు అధికం అవుతున్నారు.ఇలా ఆలోచించే వారికి ఇదొక మంచి అవకాశం అంట.

అదేంటో తెలుసుకుంటే.సేంద్రియ విధానంలో లాభాదాయకమైన చేపల సాగు అట.రీసర్కులేటింగ్‌ ఆక్వా కల్చర్‌ సిస్టంను వ్యవసాయ క్షేత్రంలో నిర్మించి, చేపల పెంపకాన్ని చేపట్టడం ద్వారా మంచి ఆదాయం సాధిస్తున్నారట ఔత్సాహిక యువకులు, యువరైతులు.కాగా మీ చుట్టు పక్కల నదులు, వరదనీటి కాలువలు లాంటివి లేకుండా నే కేవలం బోర్లతో ఆధునిక పద్ధతులను అవలంభిస్తూ చేపల పెంపకంలో ఊహించనంతగా లాభాలు పొందవచ్చట.

అదీగాక అల్ట్రా హైడెన్సిటీపద్ధతిలో చేపల పెంపకం ద్వారా చేపల వ్యర్థాలతో కూరగాయలు కూడా పెంచుకుకోవచ్చట.ఇకపోతే ఈ కల్టివేషన్ స్ట్రక్చర్‌ను నిర్మించేందుకు ఎక్కువగా ఖర్చు అవుతున్నప్పటికీ ఆదాయం కూడా స్థిరంగా వస్తుందని చెబుతున్నారు.

కాగా ఈ పద్ధతిని అనుసరిస్తూ, పావు ఎకరం విస్తీర్ణంలో 70 టన్నుల చేపల దిగుబడిని సాధిస్తున్నారట రైతులు.ఈ ఆర్ఏఎస్ పద్దతిలో పెరిగే చాపలకు మార్కెట్లో విలువ కూడా ఎక్కువేనట.

Advertisement

ఇక చెరువులో చేపల పెంపకం చేపడితే ఎక్కువగా చేపల వ్యర్థాలు చెరువుల్లోనే ఉండిపోతున్నాయి.అవి అలా డీకంపోజ్ అవ్వడం వల్ల వాటి నుంచి రకరకాల హానికారక గ్యాస్‌లు విడుదలై , అమోనియా శాతం పెరిగిపోయి చేపలకు నష్టం వాటిల్లుతోంది.

దీని వల్ల రైతులు చేపల పంటను కోల్పోతున్నారు.కానీ ఈ పద్ధతిలో మాత్రం ఎప్పటికప్పుడు నీటిని శుభ్రం చేస్తూ చేపల పెంపకాన్ని చేవయచ్చు.కాగా ఈ విధానం ద్వారా తక్కువల తక్కువ రూ.40 లక్షల నుంచి రూ.80 లక్షల దాకా ఆదాయం లభిస్తుందని నిపుణులు సూచిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు