ఈ మధ్య మోసాలు ఎక్కువుగా జరుగుతున్నాయి.మాయమాటలతో వలలో వేసుకుని నిలువునా దోపిడీ చేస్తున్నారు.
అలాంటి ఉదంతమే తాజాగా వెలుగులోకి వచ్చింది.ఒక అమ్మాయి మ్యాట్రిమోనీ సైట్ లో ప్రొఫైల్ పెట్టి పెళ్లి సంభంధాల పేరుతో అబ్బాయిల దగ్గర డబ్బులు కాజేసి తర్వాత ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పెట్టుకుంటుంది.
ఈ యువతి ఎన్నారై కుర్రాళ్ళనే తన వలలో వేసుకుని వారిని మోసం చేయడమే పనిగా పెట్టుకుంది.ఆ యువతి చేతిలో మోసపోయిన ఒక ఎన్నారై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.ఒక వ్యక్తి అమెరికాలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పని చేస్తున్నాడు.లక్షల్లో జీతం కూడా సంపాదిస్తున్నాడు.అందుకే ఇంట్లోవారు పెళ్లి సంబంధాలు చూడాలని అనుకున్నారు.
అయితే ఆ వ్యక్తి మ్యాట్రిమోనీ సైట్ లో సెర్చ్ చేస్తూ ఉండగా అర్చన అనే అమ్మాయి ప్రొఫైల్ చూసాడు.ఆ అమ్మాయి ప్రొఫైల్ లో అన్ని తనకు అనుగుణంగా ఉండడంతో పాటు ఆ అమ్మాయి కూడా అమెరికాలో జాబ్ చేస్తుంది.
వెంటనే అర్చనకు ఫోన్ చేసి పెళ్లి గురించి మాట్లాడడంతో ఆమె ముందు మా అమ్మానాన్నలతో మాట్లాడమని వాళ్లకు నచ్చితేనే పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో ఆమె మరింతగా నచ్చేసింది.ఇరు కుటుంబాలు ఫోన్లో మాట్లాడుకున్నారు.
అన్ని కుదిరిన తర్వాత అర్చన ఆ వ్యక్తికి ఫోన్ చేసి గిఫ్ట్ కావాలని అడగడంతో కాబోయే భార్య అడిగిందని గోల్డ్ చైన్ కొని పంపించాడు.
మరికొద్ది రోజులు గడిచిన తర్వాత స్నేహితురాలికి సీరియస్ గా ఉందని చెప్పి 25 లక్షలు కావాలని చెప్పడంతో వెంటనే పంపించాడు.
ఇలా వేరు వేరు కారణాలు చెప్పి అతడి దగ్గర 70 లక్షల వరకు వసూలు చేసింది.కొన్ని రోజులకు పెళ్లి గురించి ఎంత ఒత్తిడి చేసిన స్పందించడం లేదు.
తర్వాత అర్చన ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకోవడంతో మోసపోయానని అర్ధమయ్యి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆ యువతి గురించి పోలీసులు ఆరా తీయడంతో ఆమె చేసిన మోసాలు బయట పడ్డాయి.

ఇలానే చాలా మంది ఎన్నారైలను మోసం చేసింది.ఆమె ఇంతకు ముందు కూడా ఇలాంటి కేసులో అరెస్ట్ అయ్యినా ఆమె తన పద్ధతి మార్చుకోలేదు.వేరు వేరు పేర్లతో మ్యాట్రిమోనీ సైట్ లలో ప్రొఫైల్ పెట్టి చాలా మంది దగ్గర డబ్బులు కాజేసింది.
అమెరికా ఫోన్ నెంబర్ అనిపించేలా ఒక వర్చువల్ నెంబర్ క్రియట్ చేసుకుని మోసాలకు పాల్పడుతుంది.
ఈమె కొన్ని వాయిస్ మార్చే యాప్స్ ద్వారా అన్ని రకాల గొంతులతో మాట్లాడేది.
ఎంబీఏ చదివిన ఈమెకు జల్సాగా బతకడం అలవాటు అయిపోయి మోసాలు చేస్తూ డబ్బులు సంపాదిస్తుంది.ఈమెకు ఇంతక ముందే దుర్గ ప్రసాద్ అనే వ్యక్తితో పెళ్లి అయ్యింది.
ఆమె చేతిలో మోసపోయిన ఒక ఎన్నారై ఇచ్చిన ఫిర్యాదుతో ఆమెను రాచకొండ పోలీసులు అరెస్ట్ చేసారు.