మోదీ వెనకడుగు .. బాబు తప్పటడుగు 

పరిస్థితులు ఎంత విపత్కరంగా ఉన్నా, టిడిపి అధినేత చంద్రబాబులో మాత్రం ఎప్పుడూ కొత్త ఉత్సాహం కనిపిస్తూనే ఉంటుంది.

అంతే కాదు ఆ ఉత్సాహం పార్టీ శ్రేణులలోనూ కనిపించే విధంగా సరికొత్త ఎత్తుగడలు వేస్తూ, ఎప్పటికప్పుడు రాజకీయంగా పైచేయి సాధించేందుకు ప్రయత్నిస్తూ వస్తుంటారు.

ప్రస్తుతం అధికార పార్టీ వైసీపీ హవా ఏపీలో ఎక్కువగా కనిపిస్తోంది.అడుగడుగున తెలుగుదేశం పార్టీని దెబ్బతీయడమే లక్ష్యంగా ముందుకు వెళ్తోంది.

ప్రస్తుతం జరిగిన పంచాయతీ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీని ఘోరంగా దెబ్బ తీసి, వైసిపి తన సత్తా చాటుకుంది.ఎక్కువమంది మద్దతుదారులను గెలిపించుకొని తనకు తిరుగు లేదు అని జగన్ నిరూపించుకుని తెలుగుదేశం పార్టీని మరింత కష్టాల్లోకి నెట్టాడు.

  త్వరలో ఎంపీటీసీ, జెడ్పిటిసి, మున్సిపల్ ఎన్నికలు ఉండడంతో, ఆ ఎన్నికల్లోనూ టిడిపిని దెబ్బ కొట్టే విధంగా జగన్ ముందుకు వెళుతున్నారు.దీంతో తెలుగుదేశం పార్టీ నేతల్లో పెరిగిపోతున్న నిరాశ నిస్పృహలను కట్టడి చేసేందుకు చంద్రబాబు జమిలి ఎన్నికల మంత్రాన్ని మళ్ళీ తెరపైకి తీసుకువచ్చారు.

Advertisement

త్వరలోనే వైసీపీ పాలన అంతం అవుతుందని, జమిలి ఎన్నికలు త్వరలోనే రాబోతున్నాయని, తెలుగు తమ్ముళ్లు అంతా ఆ ఎన్నికలలో వైసీపీని ఓడించేందుకు సిద్ధంగా ఉండాలని, మరోసారి తెలుగుదేశం పార్టీ సత్తా  చాటాలని చెబుతూ, ఉత్సాహ పరుస్తున్నారు.అయితే జమిలి ఎన్నికలు రావాలి అంటే తెలుగుదేశం పార్టీనో, వైసీపీనో తలుచుకుంటే రావు, కేంద్రం ఆ దిశగా అడుగులు వేయాలి.

జమిలి ఎన్నికలు నిర్వహించేందుకు మొదట్లో బిజెపి ప్రభుత్వం ఉత్సాహం చూపించినా, మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో వెనకడుగు వేస్తోంది.ఒకవైపు వ్యవసాయ సంస్కరణల చట్టం తీసుకురావడంతో దానిని రద్దు చేయాలంటూ పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్ రైతులు పెద్ద ఎత్తున ఢిల్లీ వీధుల్లో లక్షలాదిగా తరలి వచ్చి ఆందోళనలు నిర్వహిస్తున్నారు.

మరోవైపు చూస్తే జిఎస్టి, పెట్రోల్, డీజిల్ గ్యాస్ ధరలు విపరీతంగా పెరిగిపోయాయి.ఇతర ప్రభుత్వ ఆస్తులను ప్రైవేటీకరణ చేసే విధంగా ప్రభుత్వం ముందుకు వెళుతూ, ప్రైవేటీకరణ తప్పదని వీటికి అందరూ సహకరించాలని మోదీ సందేశాలు ఇస్తుండడం వంటి కారణాలతో సామాన్యులు సైతం కేంద్రం తీరు పై రగిలిపోతున్నారు.ఇటువంటి పరిస్థితుల్లో ఎన్నికలు వస్తే, బిజెపి ఘోరంగా దెబ్బతినే అవకాశాలు లేకపోలేదు.

దీనికి తోడు బిజెపికి మిత్రపక్షాలు దూరమవుతున్న ఈ పరిస్థితుల్లో జమిలి ఎన్నికలకు వెళ్ళకూడదనే ఆలోచనలో ప్రధాని ఉన్నారు.ఒకవేళ జమిలి ఎన్నికలకు వెళ్దాం అనే ఆలోచనలో కేంద్ర ప్రభుత్వం ఉన్నా, ప్రజల్లోకి వెళ్లేందుకు తగ్గ పరిస్థితులు, సెంటిమెంట్, ఏది కనిపించడం లేదు.

ఫేక్ వీడియో షేర్ తో సంబంధం లేదు.. ఢిల్లీ పోలీసులకు రేవంత్ రిప్లై
నేటి ఎన్నికల ప్రచారం : బాబు అక్కడ .. జగన్ ఇక్కడ 

అందుకే బిజెపి ప్రభుత్వం జమిలి ఎన్నికల ఆలోచనను పక్కన పెట్టేసింది.అయినా చంద్రబాబు మాత్రం జమిలి ఎన్నికలు వస్తాయని, వైసిపి పాలన అంతం అవుతుందని ఇంకా చెబుతూనే, పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపుతూ, జమిలి ఎన్నికలు వస్తే గట్టెక్కేందుకు అవసరమైన అన్ని ప్లాన్లు సిద్ధం చేసుకునే పనిలో ఉన్నారు.

Advertisement

జమిలి ఎన్నికలు విషయంలో కేంద్రం వెనకడుగు వేసినా తాము మాత్రం ముందడుగు వేస్తాము అన్నట్లుగా చంద్రబాబు వ్యవహార శైలి కనిపిస్తుండడంతో, రాజకీయంగా ఆయన విమర్శలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

తాజా వార్తలు