ఎమ్మెల్సీ ఎన్నికలలో విజయం కోసం కాంగ్రెస్ నాయకులు ఒక్కటయ్యేనా?

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి విచిత్రంగా తయారయింది.

దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఘోర పరాజయం మూటకట్టుకున్న తరువాత పీసీసీ చీఫ్ గా ఉత్తమ్ రాజీనామా చేయడంతో క్షేత్ర స్థాయి కార్యకర్తలకు భరోసా ఇచ్చే ఒక నాయకుడు లేకపోవడంతో కార్యకర్తలకు ప్రజల్లోకి ఎవరి పేరు చెప్పి ప్రచారం చేయాలో అర్థం కాక తలలు పట్టుకుంటున్న పరిస్థితి ఉంది.

అంతో, ఇంతో కాంగ్రెస్ ను బలోపేతం చేయడానికి ప్రయత్నం చేస్తున్నా కాంగ్రెస్ పార్టీలో ఉండే సాధారణంగా ఉండే కూటముల కుమ్ములాటలతో మరింత బలహీనంగా తయారవుతున్నది.అదే ఎన్నికలలో ఘోర పరాజయానికి నాంది పలుకుతోంది.

ఇన్ని అపజయాలు పలకరిస్తున్నా, ఓటమిపై సమీక్షించుకోకుండా మరల కుమ్ములాటలుగా పరిస్థితి ఉంటే ప్రజలు నమ్మే పరిస్థితి ఉండదు.పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ జరగనున్న విషయం తెలిసిందే.

అయితే కొన్ని చోట్ల కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్నా ఆ అభ్యర్థి విజయానికి అందరూ కలిసికట్టుగా ప్రచారం చేస్తే ఉన్న బలం కాస్త రెట్టింపయి కాంగ్రెస్ గెలుపుకు దోహదపడుతుంది.ఒకవేళ ఓడిపోతే రాష్ట్ర వ్యాప్తంగా విమర్శలు ఎదుర్కోవలసి వస్తుంది.

Advertisement

చూద్దాం ఈ ఎమ్మెల్సీ ఎన్నికలలో నైనా అందరూ ఒకటై కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించి కాంగ్రెస్ పార్టీ బలాన్ని చాటుతారో లేదో చూడాల్సి ఉంది.

నేటి ఎన్నికల ప్రచారం : బాబు అక్కడ .. జగన్ ఇక్కడ 
Advertisement

తాజా వార్తలు