తెలంగాణ రాష్ట్రంలో రాజన్న రాజ్యం లేదు అంటూ కీలక స్థాయిలో కామెంట్లు చేసి దాదాపు కొత్త పార్టీ దిశగా షర్మిల అడుగులు వేస్తున్నట్లు తాజా పరిణామాలను బట్టి తెలుస్తోంది.ఈ క్రమంలో తెలంగాణ లో వైయస్సార్ సన్నిహితులతో, ఆత్మీయులతో, మద్దతుదారులతో జిల్లాల వారీగా భేటీ అవడానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్న షర్మిల త్వరలోనే అనగా మార్చి నెలలో కొత్త పార్టీకి సంబంధించి ప్రకటన రాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
ఇలాంటి తరుణంలో తెలంగాణలో వివిధ పార్టీలకు చెందిన నాయకులు అన్న తో గొడవ పడే తెలంగాణలో కొత్త పార్టీ పెట్టడానికి షర్మిల రెడీ అయిందని సెటైర్లు వేస్తున్నారు.ఇదిలా ఉంటే షర్మిల కొత్తపార్టీపై ప్రభుత్వ సలహాదారుడు వైసిపి పార్టీ కీలక నేత సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు.
వైయస్ జగన్ తో షర్మిలకు విభేదాలు ఉన్నట్లు వచ్చిన వార్తలను ఖండించారు.కొత్త పార్టీ విషయంలో వైసీపీ పెద్దలు అదే విధంగా జగన్ కూడా వద్దన్నారని, కానీ షర్మిల పూర్తిగా తానే బాధ్యత వహించుకుని తన సొంతంగా పార్టీ పెట్టుకున్నట్లు స్పష్టం చేశారు.
కొత్త పార్టీ పెడితే ఎదురయ్యే ప్రాక్టికల్, రాజకీయ ఇబ్బందులు అన్నీ వివరించినా గాని ఆమె బాధ్యత వహించి, ఆమె సొంతంగా పార్టీ పెట్టుకున్నట్లు సజ్జల స్పష్టం చేశారు.