ప్రేమ గుడ్డిది అని, అలాగే ప్రేమ మైకంలో పడిన వాళ్ళు తమ ప్రేమ కోసం ఏం చేయడానికైనా సిద్ధ పడుతుంటారని చాలా మంది చెబుతుంటారు.అయితే ఈ మధ్యకాలంలో జరిగినటువంటి కొన్ని సంఘటనలను చూస్తే ఇది నిజమేనని అనిపించక మానదు.
తాజాగా సోషల్ మీడియా మాధ్యమాలలో 65 సంవత్సరాలు కలిగి ఉద్యోగం విరమణ చేసిన ఓ ఉపాధ్యాయురాలు 23 సంవత్సరాలున్న యువకుడిని ప్రేమించి పెళ్లి కూడా చేసుకున్న ఘటన పాకిస్థాన్ దేశంలో వెలుగు చూసింది.
పూర్తి వివరాల్లోకి వెళితే అరియనా అనే 65 సంవత్సరాలున్న మహిళ ఆసియా దేశాలలో నివసిస్తోంది.
అయితే ఈమె కుటుంబ పోషణ నిమిత్తం ఉపాధ్యాయురాలిగా పని చేసేది.ఇటీవలే ఉద్యోగ విరమణ కూడా చేసింది.
ఈ క్రమంలో అప్పుడప్పుడు కాలక్షేపం కోసం సోషల్ మీడియా మాధ్యమం అయిన ఫేస్ బుక్ ని ఉపయోగిస్తూ ఉండేది.దీంతో ఫేస్ బుక్ లో పాకిస్తాన్ దేశానికి చెందిన అబ్దుల్లా అనే 23 సంవత్సరాలు కలిగిన యువకుడితో పరిచయం ఏర్పడింది.
ఈ పరిచయం కాస్త కొద్దికాలంలోనే పరిణయానికి దారి తీసింది.దీంతో ఇరువురు పెళ్లి గురించి ఒక క్లారిటీ కి రావడంతో తమ దేశాల అధికార ప్రతినిధులతో మాట్లాడి పెళ్లి కూడా చేసుకున్నారు.
దీంతో ఈ విషయం ప్రస్తుతం సోషల్ మీడియా మాధ్యమాలలో తెగ వైరల్ అవుతోంది.ఈ విషయంపై స్పందించిన కొందరు నెటిజన్లు ప్రేమ ఎప్పుడు ఎవరి జీవితంలో ఎలా పుడుతుందో చెప్పడం చాలా కష్టతరమని, కానీ కలిసి బ్రతకాలనుకునే వారికి వయసుతో సంబంధం లేదని ఈ ఇద్దరు ప్రేమికులు నిరూపించారని కామెంట్లు చేస్తున్నారు.
మరికొందరు మాత్రం వయసు మళ్ళి కాటికి కాళ్ళు జాపుకున్న సమయంలో 23 సంవత్సరాల యువకుడితో పెళ్లి అవసరమా.? అంటూ విడ్డూరంగా ఎద్దేవా చేస్తున్నారు.అయినప్పటికీ అరియనా మరియు అబ్దుల్లా లు ఇలాంటి కామెంట్లు ఏమాత్రం పట్టించుకోకుండా హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్నారు. ప్రస్తుతం వీరిద్దరూ పాకిస్తాన్ దేశ పరిధిలో ఉన్న చెక్ రిపబ్లిక్ లో నివాసం ఉంటున్నట్లు సమాచారం.
అయితే ఇటీవలే కొందరు వైద్యులు ఈ పెళ్లిపై స్పందించి 65 ఏళ్ల వయసులో తోడు కోసం పెళ్లి చేసుకుంటే ఓకే గాని శృంగారం విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలని లేకపోతే పలు ఆరోగ్యపరమైన సమస్యలు వస్తాయని అరియనా కి సూచించారు.అంతేగాక ఈ వయసులో గర్భం దాల్చెటువంటి మహిళలకి ప్రసవం చాలా కష్టతరంగా ఉంటుందని కాబట్టి వీలైనంత వరకూ శృంగార జీవితానికి దూరంగా ఉండాలని చెబుతున్నారు.