కామెడీ కమర్షియల్ చిత్రాలతో టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్న దర్శకుడు మారుతి.మారుతీ ప్రస్తుతం యాక్షన్ హీరో గోపీచంద్ తో తన నెక్స్ట్ సినిమాని ప్లాన్ చేసుకున్నాడు.
ఈ సినిమా షూటింగ్ ఇంకా ప్రారంభం కాకుండానే రిలీజ్ డేట్ ని కూడా చిత్ర యూనిట్ ఎనౌన్స్ చేసింది.గీతా ఆర్ట్స్2, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు.
ప్రస్తుతం సిటీమార్ సినిమా షూటింగ్ చివరి దశలో ఉన్న గోపీచంద్ దానిని పూర్తి చేసిన వెంటనే మారుతి సినిమాని సెట్స్ పైకి తీసుకొని వెళ్తాడు.ఇక గోపీచంద్ కోసం లౌక్యం తరహాలో కామెడీ, యాక్షన్ కథాంశంతో కమర్షియల్ కథని సిద్ధం చేశాడు.
ప్రస్తుతం ఈ సినిమాకి సంబందించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.
ఇదిలా ఉంటే ఈ సినిమాలో హీరోయిన్ కోసం ఇప్పుడు మారుతి ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తుంది.
మొన్నటి వరకు సాయి పల్లవి డేట్స్ కోసం ప్రయత్నం చేశాడు.అయితే ఆమె ప్రస్తుతం శ్యామ్ సింగరాయ్ సినిమాతో పాటు అయ్యప్పన్ కోషియమ్ రీమేక్ లో పవన్ కళ్యాణ్ కి జోడీగా నటిస్తుంది.
దాంతో పాటు మరో రెండు సినిమాలకి సైన్ చేసి ఉంది.దీంతో ఆమె డేట్స్ అందుబాటులో లేవు.
ఈ నేపధ్యంలో మరో హీరోయిన్ కోసం వేట సాగిస్తున్నాడు.కొత్త హీరోయిన్ కంటే ఎస్టాబ్లిష్ హీరోయిన్ అయితే బెటర్ అనే ఉద్దేశ్యంతో మారుతి ఉన్నట్లు తెలుస్తుంది.
ఈ నేపధ్యంలో రాశీఖన్నా, ఐశ్వర్య రాజేష్ లాంటి హీరోయిన్ పేర్లు పరిశీలిస్తున్నట్లు తెలుస్తుంది.దాంతో పాటు కుర్ర హీరోయిన్స్ పేర్లు కూడా పరిశీలిస్తున్నారు.
త్వరలో హీరోయిన్ ఎవరనేది అఫీషియల్ గా కన్ఫర్మ్ చేసే అవకాశం ఉంది.