జనసేన, బిజేపి పార్టీలు పొత్తు పెట్టుకున్న సంగతి తెలిసిందే.ఏపి లో ప్రధాన పార్టీగా జనసేన ను తీర్చిదిద్దెందుకు పవన్ కళ్యాణ్ బాగానే శ్రమ పడుతున్నాడు.
ఏపి లో త్వరలో తిరుపతి లోక్ సభ స్థానం కు ఉప ఎన్నిక జరగనున్నది.తిరుపతి ఉప ఎన్నికను అధికార ప్రతి పక్ష పార్టీలు ఛాలెంజింగ్ గా తీసుకున్నాయి.
ఇప్పటికే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ స్థానంపై రాష్ట్ర బిజేపి నేతలతో చర్చలు జరిపి మాలో ఎవరు నిలుచుంటారో అనే విషయంను త్వరలో ప్రకటిస్తాంని కొన్ని రోజుల క్రిందటనే ప్రకటించాడు.ఈ నేపథ్యంలో జనసేన బిజేపి పార్టీ నాయకులు ఓ మూడు గంటలపాటు చర్చలు జరిగినట్లుగా జనసేన ఓ ప్రకటన విడుదల చేసింది.
తిరుపతి ఉప ఎన్నికకు ఎలా సిద్దం అవ్వాలి, ఎలాంటి ప్రణాళికలు రచించాలి అనే విషయంపై చర్చించినట్లుగా తెలుస్తుంది.అలాగే కేంద్ర నుండి బిజేపి పెద్దలను ప్రచారంలోకి దింపాలని చూస్తుంది.
అమిత్ షా, జేపి నడ్డ, వంటి మంత్రుల సేవలను ఉపయోగించుకోవాలనే ఆలోచనలో జనసేన ఉంది.మరి రాష్ట్ర బిజేపి నేతలు ఈ విషయంలో ఎలాంటి అభిప్రాయం ను వ్యక్తం చెయ్యనున్నారో మరి కొన్ని రోజుల్లో తెలియనున్నది.
మరోసారి ఈ విషయంపై రెండు పార్టీలు చర్చకు వచ్చి నిర్ణయం తీసుకొనున్నాయి.
.






