దాదాపు రెండు దశాబ్దాల క్రితం కామెడీ ప్రాధాన్యత ఉన్న చిత్రాల్లో ఎక్కువగా నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు సీనియర్ నరేష్.కెరీర్ మొదట్లో హీరోగా ఎక్కువగా నటించిన సీనియర్ నరేష్ ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ తరహా పాత్రల్లో ఎక్కువగా నటిస్తున్నారు.
గతేడాది ఎంత మంచివాడవురా, డిస్కో రాజా, భీష్మ, ఒరేయ్ బుజ్జిగా, అమరం అఖిలం ప్రేమ, సోలో బ్రతుకే సో బెటర్ సినిమాల్లో నటించారు.
నరేష్ నటించిన సినిమాల్లో ఎక్కువ సినిమాలు హిట్ అవుతూ ఉండటంతో నరేష్ కు వరుసగా అవకాశాలు కూడా వస్తున్నాయి.
ప్రస్తుతం ఈ నటుడు రోజుకు 3 లక్షల రూపాయలు పారితోషికం తీసుకుంటున్నాడని తెలుస్తోంది.సీనియర్ నరేష్ మంచి పాత్రలను ఎంచుకుంటూ సినిమాసినిమాకు తన మార్కెట్ రేంజ్ ను పెంచుకుంటున్నారని సమాచారం.
ప్రస్తుతం నరేష్ తీరిక లేకుండా వరుస ఆఫర్లతో బిజీగా గడుపుతున్నాడని తెలుస్తోంది.

ప్రస్తుతం ఏ ఆర్టిస్ట్ లేనంత బిజీగా నరేష్ ఉన్నాడని సమాచారం.కొందరు దర్శకులు నరేష్ కోసం ప్రత్యేక పాత్రలను సృష్టిస్తున్నారని తెలుస్తోంది.మరి కొందరు దర్శకులు తమ ప్రతి సినిమాలో నరేష్ కు పాత్ర ఉండే విధంగా జాగ్రత్త పడుతున్నారు.
సినిమాల, పాత్రల ఎంపిక విషయంలో జాగ్రత్తలు వహిస్తూ సీనియర్ నరేష్ వరుస అవకాశాలతో బిజీ అవుతున్నారు.మరి కొన్నేళ్ల పాటు టాలీవుడ్ లో నరేష్ హవా కొనసాగుతుందనే చెప్పాలి.
ఈ మధ్య కాలంలో రొమాంటిక్ కామెడీ ఎంటర్టైన్మెంట్ సినిమాలు ఎక్కువగా హిట్ అవుతున్నాయి.ఎలాంటి పాత్రలోనైనా నటించి సీనియర్ నరేష్ అవలీలగా మెప్పిస్తూ ఉండటం కూడా ఆయన వరుస అవకాశాలతో బిజీగా ఉండటానికి కారణమవుతోందని చెప్పవచ్చు.
ఈ ఏడాది విడుదలవుతున్న పెద్ద సినిమాలతో పాటు చిన్న సినిమాల్లో కూడా సీనియర్ నరేష్ నటిస్తున్నట్టు సమాచారం.