తెలుగమ్మాయి అయిన కూడా కోలీవుడ్ లోనే ముందుగా నటిగా కెరియర్ ప్రారంభించిన అందాల భామ ఐశ్వర్య రాజేష్.ఈ అమ్మడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, నటిగా ఇప్పటికే తమిళంలో 25 సినిమాలని పూర్తి చేసేసింది అంటే అక్కడ ఐశ్వర్య రాజేష్ కెరియర్ ఎంత జెట్ స్పీడ్ తో దూసుకుపోయిందో అర్ధం చేసుకోవచ్చు.
కేవలం హీరోయిన్ పాత్రలు చేయాలని రూల్ పెట్టుకోకుండా ప్రత్యేకత చెప్పించే ఎలాంటి పాత్ర అయినా చేయడానికి ఐశ్వర్య రాజేష్ ఎప్పుడు ముందుంటుంది.స్టార్ హీరోలకి జోడీగా నటించడంతో పాటు లేడీ ఒరియాంటెడ్ కథలతో కూడా మెప్పించింది.
ఇక తెలుగులో ఎంట్రీ ఇవ్వడానికి ఈ భామ చాలా సమయం తీసుకుంది.మిస్ మ్యాచ్ అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చి తరువాత వరల్డ్ ఫేమస్ లవ్ స్టోరీ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది.
ఇప్పుడు టక్ జగదీశ్ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది.దీంతో పాటు అయ్యప్పన్ కోషియమ్ రీమేక్ లో రానాకి జోడీగా, అలాగే క్రిష్, పవన్ కళ్యాణ్ మూవీలో పవన్ ని ప్రేమించే గిరిజన అమ్మాయిగా ఐశ్వర్య రాజేష్ నటిస్తుంది.
ఓ విధంగా చూసుకుంటే తెలుగులో స్టార్ హీరోల సినిమాలు అన్ని లైన్ లో ఉన్నాయి.

ఇదిలా ఉంటే ప్రస్తుతం తమిళంలో మరో కొత్త సినిమాకి ఐశ్వర్య రాజేష్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.డ్రైవర్ జమున అనే లేడీ ఓరియంటెడ్ సినిమా కమిట్ అయినట్టు తెలిపారు.ఈ సినిమాలో క్యాబ్ డ్రైవర్‌గా ఐశ్వర్య రాజేష్ కనిపించబోతుంది.
న్సిలిన్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది.‘ఇలాంటి స్పెషల్ రోజున ఈ స్పెషల్ ప్రాజెక్ట్‌ను ప్రకటించడం చాలా సంతోషంగా ఉందని ఆమె పుట్టినరోజు సందర్భంగా ఐశ్వర్య తన కొత్త సినిమా గురించి ప్రకటించింది.