రిలీజ్ డేట్ మార్చుకున్న అల్లుడు.. అయినా అదుర్స్!

టాలీవుడ్‌లో సంక్రాంతి బరిలో వచ్చే సినిమాలకు మంచి క్రేజ్ నెలకొంటుంది.అయితే ఈసారి కూడా సంక్రాంతికి పలు సినిమాలు పోటీ పడుతున్నాయి.

 Alludu Adhurs Release Date Changed, Alludu Adhurs, Bellamkonda Sreenivas, Nabha-TeluguStop.com

ఇందులో బెల్లంకొండ సాయ శ్రీనివాస్ నటిస్తున్న అల్లుడు అదుర్స్ కూడా ఒకటి.పూర్తి కామెడీ ఎంటర్‌టైనర్ మూవీగా ఈ సినిమాను దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ తెరకెక్కించాడు.

ఇక ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్, టీజర్స్, ట్రైలర్ ఈ సినిమాపై మంచి హైప్‌ను క్రియేట్ చేశాయి.కాగా ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 15న రిలీజ్ చేస్తు్న్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించిన సంగతి తెలిసిందే.

అయితే చివరి నిమిషంలో ఈ సినిమా రిలీజ్ డేట్‌ను మారుస్తూ చిత్ర యూనిట్ నిర్ణయం తీసుకుంది.ఈ సినిమాను జనవరి 15న కాకుండా ఒకరోజు ముందుగానే రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది.

సంక్రాంతి నాడు అంటే జనవరి 14న ఈ సినిమాను బ్రహ్మాండమైన రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ సిద్ధమయ్యింది.దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ ఈ సినిమాతో మరోసారి బాక్సాఫీస్ వద్ద హిట్ కొట్టి తీరుతాడని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది.

ఇక ఈ సినిమాలో బెల్లంకొండ శ్రీనివాస్ అదిరిపోయే పర్ఫార్మెన్స్ ఇచ్చినట్లు తెలుస్తోంది.ఇక ఈ సినిమాలో ఆయన చేయబోయే కామెడీ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించడం ఖాయమని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది.

అందాల భామ నభా నటేష్ ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోండగా ప్రకాష్ రాజ్, సోనూ సూద్ వంటి భారీ తారాగణం ఈ సినిమాలో నటిస్తున్నారు.ఇక ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ అందించిన సంగీతం ఈ సినిమాకు మేజర్ అసెట్ అవుతుందని చిత్ర యూనిట్ అంటోంది.

ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొనడంతో సంక్రాంతి విన్నర్‌గా నిలుస్తుందని చిత్ర యూనిట్ కాన్ఫిడెంట్‌గా ఉంది.మరి సంక్రాంతి బరిలో రాబోయే అల్లుడు నిజంగానే అదుర్స్ అనిపిస్తాడా లేడా అనేది చూడాలి.

ఏదేమైనా బెల్లంకొండ బాబు ఈ సినిమాతో మరోసారి సక్సెస్ అందుకుంటాడని ఆశిద్దాం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube