మాస్ మహారాజ్ గా టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ని సొంతం చేసుకొని స్టార్ హీరోలలో ఒకరుగా కొనసాగుతున్న నటుడు రవితేజ.క్రింది స్థాయి నుంచి కష్టపడి ఎదిగిన అతికొద్ది మంది నటులలో రవితేజ కూడా ఒకరుగా ఉంటాడు.
కెరియర్ ఆరంభంలో చాలా మంది దగ్గర రవితేజ అసిస్టెంట్ డైరెక్టర్ గా చేసేవాడు.తరువాత నటుడుగా మారి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చాలా సినిమాలలో చేశాడు.
ఇక పూరీ జగన్నాథ్ బ్రేక్ ఇవ్వడంతో హీరోగా టర్న్ తీసుకొని వెనక్కి తిరిగి చూసుకునే అవకాశం లేకుండా స్టార్ హీరోగా టాలీవుడ్ తనకంటూ సొంతం మార్కెట్ ని కూడా క్రియేట్ చేసుకున్నాడు.రవితేజ సినిమా వస్తుంది అంటే ఓపెనింగ్స్ గ్యారెంటీ అనే అభిప్రాయం ఇండస్ట్రీలో ఉంది.
ఇక సరైన కథ పడితే అతని స్పీడ్, ఎనర్జీని ఆపడం ఎవరితరం కాదని కొన్ని సినిమాలు ప్రూవ్ చేశాయి.అయితే రవితేజ నుంచి చివరిగా రాజా ది గ్రేట్ సినిమాతో హిట్ వచ్చింది.
ఈ సినిమా తర్వాత చేసిన మూడు సినిమాలు ఫ్లాప్ అయ్యాయి.ఈ సారి గట్టిగా కొట్టాలని తనకి బాగా అచ్చోచ్చిన పోలీస్ పాత్రతో మరోసారి మెస్మరైజ్ చేయడానికి రెడీ అయ్యాడు.
గోపీచంద్ మలినేని దర్శకత్వంలో క్రాక్ సినిమాతో ఈ సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకి రాబోతున్నాడు.ఈ సినిమాపై ఇప్పటికే పాజిటివ్ బజ్ ఉంది.ఇదిలా ఉంటే ఈ సినిమా ప్రమోషన్ లోభాగంగా రవితేజ ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు.ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో కెరియర్ ఆరంభంలో దర్శకత్వ శాఖలో పనిచేశారు కాబట్టి భవిష్యత్తులో దర్శకత్వం చేసే అవకాశం ఉందా అని యాంకర్ అడిగిన ప్రశ్నకి కచ్చితంగా దర్శకత్వం చేస్తా అని చెప్పుకొచ్చాడు.
అయితే అవసరాన్ని బట్టి, అవకాశాన్ని భట్టి ఉంటుందని, కచ్చితంగా ఒక సినిమాకి అయినా దర్శకత్వం వహిస్తా అని రవితేజ క్లారిటీ ఇచ్చాడు.అయితే తన సొంత సినిమాకి రవితేజ డైరెక్టర్ చేస్తాడా లేక వేరొక హీరో సినిమాకి డైరెక్షన్ చేస్తాడా అనేది చూడాలి.







