సినిమా ఇండస్ట్రీ అనేది కళల ప్రపంచం.ఈ కళల ప్రపంచంలో ఎన్నో మోసాలు.
ఎవరిని నమ్మాలో తెలియదు.ఎవరిని నమ్మకూడదో తెలియదు.
సగం సగం తెలుసుకొని సినిమాల్లోకి రావాలని ఇండస్ట్రీలోకి అడుగుపెడితే దారుణంగా చూస్తారు.దారుణంగా అవమానిస్తారు.
డబ్బు ఉంటే లాగేస్తారు.ఇలా ఇప్పుడు స్టార్ హీరోయిన్, హీరోగా, దర్శకుడిగా కొనసాగేవారికి ప్రారంభంలో ఎక్కడో ఒకచోటా ఇలాంటి ఘటనలే జరిగి ఉంటాయ్.
సినిమాలో అవకాశం ఇస్తా అంటూ ఎంతోమంది ఎన్నోరకాలుగా వాడుకొని చివరికి అవకాశం ఇవ్వకుండా దారుణంగా మోసం చేస్తుంటారు.ఇంకా మరికొందరు ఇండస్ట్రీ చుట్టూ ఒక్క అవకాశం అంటూ చెప్పులు అరిగేలా తిరుగుతారు.
అలాంటి వాళ్ళకు వచ్చే మొదటి అవకాశమే వారి జీవితాన్ని నిర్ణయిస్తుంది.ఆ ఒక్క అవకాశం వినియోగించుకుంటే ఆకాశానికి ఎత్తుతారు.
మరో ప్లాప్ పడే వరకు నిన్ను ఎవరు దించలేరు.అదే మొదటి అవకాశం వినియోగించుకోలేదో.
పాతాళానికి తొక్కేస్తారు.
ఇండస్ట్రీ కదా.అలానే ఉంటుంది.వచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకొని పాత్ర చిన్నదైనా.
పెద్దదైన నటిస్తూ వెళ్తే ఏదో ఒకరోజు స్టార్ అవుతారు.ఇక అలానే దీపికా పదుకొనె కూడా.
నిజానికి ప్రారంభంలో అంత సూపర్ హీరోయిన్ ఏం కాదు.యావరేజ్ గా ఉండేది.
అలా సినిమాలు తీస్తూ దీపికా పదుకొనె కూడా అందగత్తె అనే పేరు సొంతం చేసుకుంది.ఇప్పుడు స్టార్ హీరోయిన్ గా మారింది.

అలాంటి ఈ బాలీవుడ్ హీరోయిన్ మొదట తెలుగు చిత్రం ”మన్మథుడు” కన్నడ రీమేక్ సినిమాలో నటించింది.ఆతర్వాత బాలీవుడ్ లో ఎన్నో సినిమాల్లో నటించిన పెద్దగా గుర్తింపు రాలేదు.చివరికి షారుక్ ఖాన్ సరసన ”ఓం శాంతి ఓం” సినిమాలో నటించి మంచి పేరు సొంతం చేసుకుంది.ఆతరవాత ఎన్నో అవార్డులు సొంతం చేసుకొని పెళ్లి తర్వాత కూడా సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్ గా కొనసాగుతుంది.
ఇండస్ట్రీలో పేరు రావాలంటే టైమ్ పడుతుంది.







