తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - నవంబర్ 19 గురువారం, 2020

ఈ రోజు పంచాంగం (Todays Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 06.16

సూర్యాస్తమయం:సాయంత్రం 05.

35

రాహుకాలం: మ.01.26 నుంచి 02.46 వరకు

అమృత ఘడియలు: ఉ.07.40 నుంచి 08.20 వరకు

Advertisement

దుర్ముహూర్తం: ఉ.10.00 నుంచి 10.45 వరకు<

ఈ రోజు రాశి ఫలాలు(Todays Telugu Rasi Phalalu):

మేషం:

మేష రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు కలుగుతాయి.మీ పై అధికారులను కలవడం వల్ల కొన్ని ఇబ్బందికరమైన సమస్యలను ఎదుర్కొంటారు.స్నేహితులతో కలిసి సుదీర్ఘ పర్యటనలు చేయడం వల్ల ఎంతో ఆనందంగా గడుపుతారు.

ఈ రాశివారికి సంఘంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి.ఈ రాశి వారికి 70శాతం అదృష్టం మద్దతు తెలుపుతుంది.

ఫేక్ వీడియో షేర్ తో సంబంధం లేదు.. ఢిల్లీ పోలీసులకు రేవంత్ రిప్లై
వారికి గాజు గ్లాస్ గుర్తు.. కోర్టుకెక్కిన జనసేన 

వృషభం:

Advertisement

వ్యాపార రంగంలో పని చేసేవారు అధిక శ్రమ ఎదుర్కోవాల్సి ఉంటుంది.ప్రభుత్వ ఉద్యోగాలలో పనిచేసే వారికి వారి పై అధికారుల ఆగ్రహానికి బలవుతారు.ఈ రాశి వారు కొత్తగా చేయబోయే పనులపై దృష్టిని సాధిస్తారు.

వృషభ రాశి వారికి అదృష్టం 60 శాతం మద్దతు తెలుపుతుంది.

మిథునం:

మిధున రాశి వారికి ఈ రోజు మధ్యాహ్న సమయం వరకు అధిక లాభాలు కలిగే సూచనలున్నాయి.ఎన్నో రోజుల నుంచి ఎదుర్కొంటున్న ఉద్యోగ సంబంధిత సమస్యలు పరిష్కారం అవుతాయి.సాయంత్ర సమయంలో స్నేహితులు కుటుంబ సభ్యుల మధ్య ఎంతో ఆనందంగా గడుపుతారు.

ఈ రాశి వారికి అదృష్టం 85 శాతం కలిసి వస్తుంది.

కర్కాటకం:

ఈ రాశి వారు ఈ రోజు ఎంతో ఉల్లాసంగా గడుపుతారు.ప్రత్యర్థులపై విమర్శలకు తావు ఇవ్వకుండా మీ పనిలో మీరు నిమగ్నం అవ్వడం వల్ల విజయాలను చేరుకుంటారు.ఈ రాశి వారు ఈ రోజు వీలైనంత వరకు వివాదాలకు గొడవలకు వెళ్లకుండా ఉండటం ఎంతో శ్రేయస్కరం ఈ రాశివారికి 60 శాతం అదృష్టం మద్దతు తెలుపుతుంది.

సింహం:

ఈ రాశివారు వృత్తిపరంగా ఎక్కువగా శ్రమించడం వల్ల విజయాలను సొంతం చేసుకుంటారు.అనవసరమైన ఇబ్బందులతో మనసు చిరాకుగా ఉంటుంది.ఈరోజు మీకు తెలియని ఏ వ్యక్తి అయినా ఇచ్చి పుచ్చుకోవడాలు చేయకుండా జాగ్రత్త వహించండి.

ఈ రాశి వారికి అదృష్టం 58 శాతం మద్దతు తెలుపుతుంది.

కన్య:

ఈ రాశివారు కుటుంబంతో ఎంతో ఆనందంగా గడుపుతారు.ఎన్నో రోజుల నుంచి వెంటాడుతున్న ఇంటి సమస్యలు పరిష్కారమవుతాయి.ప్రభుత్వాల నుంచి సహాయ సహకారాలను అందుకుంటారు.

ఈరోజు ఆకస్మిక ధనలాభం కలుగుతుంది.ఈ రాశి వారికి అదృష్టం 56 శాతం మద్దతు తెలుపుతుంది.

తులా:

ఈ రాశి వారికి ఈ రోజు కొంతమేర ఇబ్బందికరంగా ఉంటుంది.దూర ప్రయాణాలు వాయిదా పడే అవకాశాలు ఉన్నాయి.మీరు పడుతున్న సమస్యలకు పరిష్కారం తెలియక మానసిక సంక్షోభం చెందుతారు.

ఈ రాశివారు వృత్తి పరంగా చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఏర్పడినప్పటికీ అంతిమ విజయం పొందుతారు.ఈ రాశి వారికి అదృష్టం 50 శాతం కలిసి వస్తుంది.

వృశ్చికం:

ఈ రాశి వారు ఈ రోజు కొంత గందరగోళ జీవితాన్ని గడుపుతారు.ప్రభుత్వ ఉద్యోగులు పై అధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు.ఈరోజు ఈ రాశి వారు వారి సంతానం నుంచి శుభవార్తలు వింటారు.

వీలైనంత వరకు ఖర్చులను తగ్గించుకోండి.ఈ రోజు నీకు అదృష్టం 70 శాతం మద్దతు తెలుపుతుంది.

ధనస్సు:

ధనస్సు రాశి వారి ఈరోజు ఆధ్యాత్మిక కార్యక్రమాల వైపు ఆసక్తి చూపిస్తారు.ఈ రాశి వారికి నూతన వ్యక్తులతో పరిచయం ఏర్పడటం వల్ల కొంతమేర ప్రయోజనకరంగా ఉంటుంది.ఏమైనా కారణాలవల్ల మీకు రావలసిన డబ్బు ఆగిపోయినట్లు అయితే తిరిగి ఆ డబ్బును ఈరోజు పొందుతారు.

ఈ రాశి వారికి అదృష్టం 70 శాతం కలిసి వస్తుంది.

మకరం:

ఈ రాశివారికి ఎంచుకున్న రంగంలో సహోద్యోగులతో లేదా పై అధికారుల నుంచి విభేదాలు ఏర్పడవచ్చు.అనుకోకుండా మీ ఇంటికి అతిథులు రావడం వల్ల ఖర్చులు కూడా పెరుగుతాయి.దంపతులు వారి వైవాహిక జీవితంలో ఆనందంగా గడుపుతారు.

ఈ రాశి వారికి అదృష్టం 67 శాతం మద్దతు తెలుపుతుంది.

కుంభం:

ఈరోజు కుంభ రాశి వారు రవాణా సానుకూల ప్రభావం తో విజయాలను అందుకుంటారు.ఈ రాశి వారు చేపట్టిన పనులలో ఆటంకాలు ఎదురైనప్పటికీ చివరికి విజయాన్ని అందుకుంటారు.గృహ వస్తువుల వినియోగం కోసం ఖర్చు చేయవలసి ఉంటుంది.

ఈ రాశి వారికి అదృష్టం 61 శాతం మద్దతు తెలుపుతుంది.

మీనం:

ఈ రాశివారు సంతానానికి సంబంధించిన సమస్యలను పరిష్కరించడానికి డబ్బులు ఖర్చు చేయాల్సి ఉంటుంది.వాతావరణంలోని మార్పుల వల్ల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది.అందువల్ల ఆరోగ్య విషయంలో జాగ్రత్త ఎంతో అవసరం.

ఈ రాశి వారికి అదృష్టం 62 శాతం కలసి వస్తుంది.

తాజా వార్తలు