టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస విజయాలతో మాటల మాంత్రికుడిగా పేరు తెచ్చుకున్నారు త్రివిక్రమ్ శ్రీనివాస్. రామ్ చరణ్, ప్రభాస్ మినహా టాలీవుడ్ యంగ్ జనరేషన్ స్టార్ హీరోలందరితో త్రివిక్రమ్ సినిమాలు తెరకెక్కించారు.
ఎన్టీఆర్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో ఒక సినిమా తెరకెక్కాల్సి ఉండగా వచ్చే ఏడాదిలో ఆ సినిమా షూటింగ్ మొదలు కానుంది.త్రివిక్రమ్ ప్రస్తుతం పవన్ హీరోగా తెరకెక్కుతున్న అయ్యప్పనుమ్ కోషియమ్ రీమేక్ రచనా సహకారం, డైలాగ్స్ అందించే పనిలో బిజీగా ఉన్నారు.
దర్శకునిగా మాత్రమే కాక రచయితగా కూడా మంచి పేరు తెచ్చుకున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ సినిమాకు రచనా సహకారం, డైలాగ్స్ కోసం తీసుకుంటున్న రెమ్యునరేషన్ ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.త్రివిక్రమ్ ఈ సినిమా కోసం ఏకంగా పది కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని సమాచారం.
ఈ వార్తలో నిజమెంతో తెలీదు కానీ రచనకు పదికోట్లు తీసుకోవడం అంటే సాధారణ విషయం కాదు.

సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కనుండగా మొదట ఈ సినిమాను టాలీవుడ్ లోని యంగ్ జనరేషన్ హీరోలతో తక్కువ బడ్జెట్ తో తీయాలని నిర్మాతలు అనుకున్నారు.సినిమాలో పవన్ కళ్యాణ్ హీరోగా ఫిక్స్ కావడంతో త్రివిక్రమ్ స్క్రిప్ట్, డైలాగ్స్ అందిస్తే సినిమాకు ప్లస్ అవుతుందని భావించి నిర్మాతలు పది కోట్లు ఇవ్వడానికి అంగీకరించారని సమాచారం.అయితే రెమ్యునరేషన్ ను త్రివిక్రమ్ డైరెక్ట్ గా తీసుకోరని తెలుస్తోంది.
తెలుగులో సినిమా విడుదలైన తర్వాత వచ్చిన షేర్ నుంచి త్రివిక్రమ్ తన రెమ్యునరేషన్ ను తీసుకోనున్నారని సమాచారం. మలయాళంలో బ్లాక్ బస్టర్ హిట్టైన అయ్యప్పనుమ్ కోషియమ్ తెలుగులో కూడా అదే స్థాయిలో హిట్ అవుతుందని నిర్మాతలు భావిస్తున్నారు.
డిసెంబర్ లో ఈ సినిమా షూటింగ్ మొదలుకానుండగా వచ్చే ఏడాది సమ్మర్ లో ఈ సినిమా విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి.