ఈ మధ్య కాలంలో టాలీవుడ్ హీరోలు నవ్యత ఉన్న కథలలో నటించటానికి ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు.ప్రేక్షకులు సైతం రొటీన్ మాస్ మసాలా సినిమాలపై ఆసక్తి చూపకపోవడంతో హీరోలు విభిన్నమైన కథలను ఎంచుకుంటున్నారు.
యంగ్ హీరో రానా క్షుద్రపూజలు, చేతబడుల నేపథ్యంలో తెరకెక్కే సినిమాలో నటించనున్నారని తెలుస్తోంది.ఈ తరహా కథాంశంతో గతంలో టాలీవుడ్ లో సినిమాలు పెద్దగా తెరకెక్కలేదు.
గృహం సినిమా ఫేమ్ మిలింద్ రావ్ ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నారు. బాహుబలి, బాహుబలి 2 సినిమల సక్సెస్ తరువాత రానా కథల విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
పాన్ ఇండియా అప్పీల్ ఉన్న సినిమాల్లో నటించడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు.సూపర్ న్యాచురల్ థ్రిల్లర్ గా ఈ సినిమా తెరకెక్కనుందని ఈ సినిమాకు ధీరుడు అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారని సమాచారం.

సురేష్ ప్రొడక్షన్స్ తో పాటు 14 రీల్స్ ప్లస్ సంస్థ ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.2021 జనవరిలో ఈ సినిమా షూటింగ్ మొదలుకానుందని తెలుస్తోంది.తెలుగుతో పాటు తమిళ, హిందీ భాషల్లో ఈ సినిమా తెరకెక్కుతోంది.రానా ఈ సినిమాతో ప్రేక్షకులను భయపెట్టనున్నారని తెలుస్తోంది.ప్రస్తుతం రానా విరాటపర్వం సినిమాలో నటిస్తున్నారు.
రానా నటించిన అరణ్య సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తి చేసుకుంది.
వరుస సినిమాలకు కమిట్ అవుతున్న రానా ధీరుడు సినిమాతో ఖచ్చితంగా సక్సెస్ సాధిస్తానని భావిస్తున్నారు.అయితే రానా ఫ్యాన్స్ మాత్రం ధీరుడు టైటిల్ డబ్బింగ్ సినిమా టైటిల్ లా ఉందని రానా స్టార్ డైరెక్టర్ల సినిమాల్లో నటిస్తే బాగుంటుందని అభిప్రాయపడుతున్నారు.
ఇలాంటి సినిమాలు అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకోకవచ్చని కామెంట్లు చేస్తున్నారు.రానా కొత్తదనం ఉన్న కమర్షియల్ సినిమాలను ఎంచుకోవాలని ఫ్యాన్స్ సూచిస్తున్నారు.మరి రానా ఫ్యాన్స్ కామెంట్ల పట్ల ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంది.







