బాబాయ్ సినిమాలో అబ్బాయి.. నందమూరి ఫ్యాన్స్‌కు పండగే!

నందమూరి బాలకృష్ణ నటిస్తున్న లేటెస్ట్ మూవీని మాస్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను డైరెక్ట్ చేస్తోన్న సంగతి తెలిసిందే.ఈ సినిమాతో మరోసారి బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే బ్లాక్‌బస్టర్ అందుకునేందుకు బోయపాటి అండ్ టీమ్ రెడీ అవుతున్నారు.

 Tarak Rathna In Balakrishna Movie, Balakrishna, Boyapati Sreenu, Tarak Rathna, B-TeluguStop.com

బాలయ్యతో కలిసి ముచ్చటగా హ్యాట్రిక్ కొట్టాలనే కసితో బోయపాటి ఈ సినిమా కథను అదిరిపోయే రీతిలో తెరకెక్కిస్తున్నాడు.ఇక ఈ సినిమాలో బాలయ్య రెండు విభిన్న పాత్రల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే.

ఇప్పటికే ఈ సినిమాలోని బాలయ్య రైతు పాత్రకు సంబంధించిన లుక్‌ను చిత్ర యూనిట్ టీజర్ రూపంలో రిలీజ్ చేయగా దానికి అదిరిపోయే రెస్పాన్స్ దక్కిన సంగతి తెలిసిందే.ఈ సినిమాలో మరో పాత్రగా అఘోరా లుక్‌లో కనిపించనున్నాడు బాలయ్య.

కాగా బోయపాటి తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో పలువురు నటీనటులు కీలక పాత్రల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే.తాజాగా ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో నందమూరి తారకరత్నను తీసుకునేందుకు బోయపాటి రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది.

యంగ్ ఎమ్మెల్యేగా నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో తారకరత్నను చూపెట్టేందుకు బోయపాటి రెడీ అవుతున్నట్లు చిత్ర వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.

మరి ఈ సినిమాలో నటించేందుకు తారకరత్న ఒప్పుకుంటాడా లేడా అనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.

ఇక ఈ సినిమాతో సింహా, లెజెండ్ వంటి చిత్రాలను మించిన విజయాన్ని అందుకోవాలని బోయపాటి ప్లాన్ చేస్తున్నాడు.ఇక ఈ సినిమాలో హీరోయిన్ ఎవరనే విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు.

కాగా ఈ సినిమా షూటింగ్‌ను తాజాగా బాలయ్య తిరిగి ప్రారంభించడంతో వీలైనంత త్వరగా ఈ సినిమాను పూర్తి చేసి రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది.ఏదేమైనా బాబాయ్ చిత్రంలో అబ్బాయ్ నటిస్తున్నాడనే వార్తతో నందమూరి ఫ్యాన్స్‌లో అదిరిపోయే క్రేజ్ ఏర్పడింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube