ఆ సినిమా కోసం హిజ్రా పాత్రలో కనిపించనున్న వాణీ కపూర్

హీరోలు ఎక్కువగా ప్రయోగాత్మక పాత్రలు చేస్తూ ఉంటారు.కొంత మంది హీరోలు అయితే తమ ప్రతి సినిమాకి ఏదో ఒక ప్రత్యేకత చూపిస్తూ విభిన్న పాత్రలు వేస్తూ మెప్పిస్తారు.

 Vani Kapoor Play Hijra Role In New Movie, Bollywood, Indian Cinema, Ayushmann K-TeluguStop.com

అయితే హీరోయిన్స్ కి మాత్రం డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రలు చాలా అరుదుగా దొరుకుతుంది.అలాంటి ప్రత్యేక పాత్రలు చేయడానికి కొంత మంది హీరోయిన్స్ మాత్రమే ఇష్టపడతారు.

ఇప్పుడు బాలీవుడ్ లో అలాంటి ప్రయోగాత్మక పాత్రలో కనిపించడానికి హీరోయిన్ వాణీ కపూర్ రెడీ అయ్యింది.తెలుగులో ఆహా కళ్యాణం సినిమాలో నానికి జోడీగా నటించిన ఈ భామ అక్కడ సక్సెస్ కోసం విశ్వ ప్రయత్నం చేస్తుంది.

ప్రస్తుతం బెల్ బాటమ్ సినిమాలో అక్షయ్ కుమార్ కి జోడీగా నటిస్తుంది.ఈ సినిమా రిలీజ్ కి రెడీ అయ్యి ఉంది.

ఇదిలా ఉంటే ప్రస్తుతం అంధాదున్ తో జాతీయ అవార్డు సొంతం చేసుకున్న విలక్షణ నటుడు ఆయుష్మాన్ ఖురానాతో ఓ సినిమా చేస్తుంది.
చండీగర్ కరే ఆషికి అనే పేరుతో రూపొందుతున్న ఈ చిత్రంలో వాణీకపూర్ హీరోయిన్ గా నటిస్తుంది.

అయితే ఆమె కనిపించేది రెగ్యులర్ హీరోయిన్ గా కాదు.ట్రాన్స్ జెండర్ గా వాణీ పాత్ర సరికొత్తగా వుంటుందని తెలుస్తోంది.

విభిన్నంగా అనిపించడంతో ఈ పాత్ర చేయడానికి వాణీ అంగీకరించిందని తెలుస్తుంది.లింగ మార్పిడి చేయించుకున్న ట్రాన్స్ జెండర్ గా వాణీ పాత్ర సరికొత్తగా వుంటుందని తెలిసింది.

ప్రస్తుతం ఈ మూవీ చిత్రీకరణ దశలో వుంది.ఇదిలా ఉంటే ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా కొద్ది రోజులు వాయిదా పడినట్లు తెలుస్తుంది.

వాణీ కపూర్ కి కరోనా నిర్ధారణకావడంతో ఆమె ట్రీట్మెంట్ తీసుకుంటూ హోమ్ క్వారంటైన్ లో ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube