కరోనాతో బీహార్ మంత్రి వినోద్ కుమార్ మృతి

కరోనా మహమ్మారి వ్యాధితో చికిత్స పొందుతున్న బీజేపీ నేత, బిహార్ మంత్రి వినోద్ కుమార్ సింగ్ తుదిశ్వాస విడిచారు.

ఢిల్లీలోని మేదాంత ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన సోమవారం ఉదయం కన్నుమూశారు.

రేపు ఆయన మృతదేహాన్ని పాట్నాకు తరలించనున్నారు.బిహార్ వెనుకబడిన మరియు అత్యంత వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ మంత్రి, భారతీయ జనతా పార్టీ నేత వినోద్ కుమార్ సింగ్ కి మంచి గుర్తింపు ఉంది.

కాగా మరికొద్ది రోజుల్లో బిహార్ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆయన స్థానమైన ప్రాన్‌పూర్ నుంచి ఆయన భార్య నిషా సింగ్‌ను ఎన్నికల బరిలోకి దింపేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది.జూన్‌లో మంత్రి వినోద్ కుమార్ కి ఆయన భార్యకూ కరోనా పాజిటివ్ అని తేలింది.

అయితే కొద్ది రోజుల చికిత్స తర్వాత ఆయన ఆసుపత్రి నుంచి డిశ్చార్జీ అయ్యారు.ఆ తర్వాత నెలన్నర తర్వాత అనారోగ్య సమస్యతో వినోద్ కుమార్‌ ఢిల్లీలోని మేదాంత ఆసుపత్రిలో చేరారు.

Advertisement

రెండు రోజుల నుంచి ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా మారింది.దీనితో సోమవారం అయన తుదిశ్వాస విడిచారని వైద్యులు తెలిపారు.

గత రెండు నెలలుగా మెరుగైన చికిత్స అందించినప్పటికీ మెదడులో రక్తం గడ్డకట్టడంతో మృత్యువు ఆయనను కబళించింది.వెనుబడిన తరగతుల సంక్షేమ శాఖ మంత్రిగా వినోద్ సింగ్ర మరణంపై ముఖ్యమంత్రి నితీష్ కుమార్ విచారం వ్యక్తం చేశారు.

సమర్థుడైన ప్రజాదరణ పొందిన నాయకుడంటూ సంతాపం వ్యక్తం చేశారు.ఆయన మరణం రాష్ట్ర రాజకీయాలకు నష్టమని బీజేపీ పేర్కొంది.

కతిహార్ జిల్లా ప్రాణ్‌పూర్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా వినోద్ సింగ్ మూడుసార్లు గెలుపొందారు.

నాగార్జున 100 వ సినిమా కథను అందిస్తున్న యంగ్ రైటర్స్...
Advertisement

తాజా వార్తలు