కాజల్ పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడానికి అసలు కారణమిదే..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతటి స్టార్ హీరోయిన్ అయినా పెళ్లి చేసుకుంటే అవకాశాలు తగ్గుతాయనే సంగతి తెలిసిందే.

పెళ్లి తర్వాత గ్లామరస్ పాత్రల్లో చూపించడానికి దర్శకులు సైతం ఇష్టపడరు.

ఇండస్ట్రీలో పెళ్లి తరువాత ఫేడవుట్ అయిన హీరోయిన్లు కూడా ఎంతోమంది ఉన్నారు.మరి కాజల్ వరుస అవకాశాలతో బిజీగా ఉన్న సమయంలో ఎందుకు పెళ్లి చేసుకుంటుందనే ప్రశ్నకు ఆసక్తికరమైన సమాధానాలు వినిపిస్తున్నాయి.

తేజ దర్శకత్వంలో లక్ష్మీ కళ్యాణం సినిమాతో ఫిల్మ్ కెరీర్ ను ప్రారంభించిన కాజల్ కు అనతి కాలంలోనే తెలుగు, తమిళ భాషల్లో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు దక్కింది.స్టార్ హీరోలతో వరుస అవకాశాలు రావడం, ఆ సినిమాల్లో ఎక్కువ శాతం హిట్లు కావడంతో కాజల్ కు అవకాశాలు ఎక్కువగా వస్తున్నాయి.14 సంవత్సరాల సినీ కెరీర్ లో కాజల్ ఎక్కువగా గ్లామరస్ పాత్రల్లోనే నటించి మెప్పించింది.ఒక దశలో అవకాశాలు తగ్గినా కాజల్ సీనియర్ హీరోలతో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం ఆమె కెరీర్ కు ప్లస్ అయింది.

అయితే చెల్లి నిషా అగర్వాల్ పెళ్లి చేసుకుని చాలా సంవత్సరాలే అయినా పెళ్లి పేరెత్తని కాజల్ అకస్మాత్తుగా ఈ నెల 30వ తేదీన ముంబైకు చెందిన గౌతమ్ కిచ్లూ అనే బిజినెస్ మేన్ ను పెళ్లి చేసుకుంటానంటూ చేసిన ప్రకటన అభిమానులను అవాక్కయ్యేలా చేసింది.కరోనా, లాక్ డౌన్ వల్ల పరిమిత సంఖ్యలో కాజల్, గౌతమ్ బంధువులు, స్నేహితులు ఈ వివాహ వేడుకకు హాజరు కానున్నారని తెలుస్తోంది.

Advertisement

నిజానికి కాజల్ కు పెళ్లి చేసుకోవడానికి ఇష్టమే లేదట.అయితే లాక్ డౌన్ వల్ల కెరీర్ లో గ్యాప్ రావడంతో పెళ్లికి ఇదే సరైన సమయమని.

గౌతమ్ పెళ్లి తరువాత కూడా సినిమాల్లో నటించడంపై ఎలాంటి ఆంక్షలు పెట్టకపోవడంతో కాజల్ పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.మరో రెండు, మూడేళ్ల తరువాత కాజల్ పెళ్లి చేసుకోవాలని భావించగా కరోనా, లాక్ డౌన్ వల్ల ఆమె వేసుకున్న ప్లాన్స్ అన్నీ మారిపోయాయని తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు